YOYO Fitness: మరోసారి తెర మీదకు యోయో ఫిట్ నెస్ టెస్ట్.. బీసీసీఐ నిర్ణయం!

YOYO Fitness: టీమిండియా భారీ అంచనాలతో ప్రతి టోర్నీలోకి అడుగుపెడుతున్నా.. ప్లేయర్ల వైఫల్యం కారణంగా ఏదో రూపంలో తిరుగు ముఖం పట్టాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా అనూహ్యంగా ఇంటి బాట పట్టడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. టీంలోని చాలామంది ప్లేయర్లు రకరకాల ఇబ్బందుల కారణంగా రాణించకపోవడంతో.. టీమిండియా కప్ లేకుండానే తిరిగి దేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

త్వరలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియాను మరింత మెరుగుపర్చడానికి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం బీసీసీఐ కార్యదర్శి జైషా, అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, ఎన్సీఏ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్, సెలెక్టర్ చేతన్ శర్మలు భేటీ అయ్యి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఉన్నటువంటి యోయో ఫిట్ నెస్ టెస్ట్ తో పాటు డెక్సాను తిరిగి ప్లేయర్లకు తప్పనిసరి చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో మరోసారి యోయో ఫిట్ నెస్ టెస్ట్ వార్తల్లోకెక్కింది.

 

యోయో ఫిట్ నెస్ టెస్ట్ అంటే ఏమిటి?:

టీమిండియా క్రికెటర్ల ఫిట్నెస్ ని పరీక్షించడానికి గతంలో జరిపిన ఫిట్ నెస్ టెస్టే యోయో ఫిట్ నెస్ టెస్ట్. విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్ గా ఉన్నప్పుడు ప్లేయర్లకు ఈ టెస్ట్ ను తప్పనిసరి చేసినా.. తర్వాత దీనిని తప్పించారు. ఈ టెస్ట్ లో 20మీటర్ల దూరంలో ఉన్న మార్కర్ల మధ్య పరుగెత్తాల్సి ఉంటుంది. వేగం పెంచుకుంటూ పరుగెత్తాల్సి ఉంటుంది. ఫిట్ నెస్ ప్రకారం ఆటగాళ్లకు ఇందులో స్కోర్ లభిస్తుంది. గతంలో 16.5 స్కోర్ సాధించాలని నియమం ఉన్నా దానిని 16.1కి తగ్గించేశారు.

 

టీమిండియా ప్లేయర్లు తరుచుగా గాయాల పాలవుతుండటం.. కీలక మ్యాచుల్లో ప్లేయర్లు అందుబాటులో ఉండకపోవడంతో టీంకు తీవ్ర నష్టం కలుగుతోందని బీసీసీఐ భావిస్తోంది. అందుకే ప్లేయర్ల ఫిట్ నెస్ కోసం తిరిగి యోయో ఫిట్ నెస్ టెస్ట్ తో పాటు డెక్సా (బోన్ స్కాన్ టెస్ట్)ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అటు నేషనల్స్ సెలక్షన్స్ కోసం ఆటగాళ్లు తగినంత దేశవాళీ క్రికెట్ అనుభవాన్ని కలిగి ఉండాలని కూడా బీసీసీఐ తాజాగా కండిషన్ పెట్టింది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -