Tarak: తారక్ ప్లాన్ చూసి ఇతర హీరోలకు దిమ్మ తిరుగుతోందా?

Tarak: నందమూరి వంశం నుంచి ఇప్పుడు ఎన్టీఆర్ వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ సంచలన విజయం సాధించింది. దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతమనే చెప్పాలి. ఆయన తదుపరి సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ తన తదుపరి సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో కాస్త ఆలస్యం అవుతోంది.

 

అయితే ఎన్టీఆర్ సినిమా ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. 2024 ఏప్రిల్ 5వ తేదిన ఈ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాను ఆ రోజే విడుదల చేయస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపింది. ఇంకా షూటింగ్ మొదలవకముందే రిలీజ్ డేట్ ప్రకటించడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

 

పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే డేట్ ఇవ్వడంలో ఓ పక్కా ప్లానింగ్ అనేది ఉంది. ఆ రోజున ఇంకెవ్వరూ కూడా కర్చీఫ్ వేయకుండా చూసుకునేందుకు చిత్ర యూనిట్ ఇలా ప్లాన్ చేసింది. విడుదల తేలి విషయంలో కొరటాల తన టీమ్ తో పక్కా ప్లానింగ్ గా ఉన్నాడు. ఎన్టీఆర్ చాలా మంచి డేటే పట్టేశాడన్న అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

 

ఏప్రిల్ 5వ తేదిన అంటే శుక్రవారం రోజు ఆ వీకెండ్లో సినిమా జోరు చూపించడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇకపోతే 9వ తేదిన ఉగాది పండుగ రోజు సెలవు కావడంతో అందరూ ఆ సినిమాకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 11వ తేదిన రంజాన్ పండగ ఉండటంతో ఆ రోజు కూడా సెలవు ఉండనుంది.

 

కాబట్టి సినిమా సందడి మొదలై ఆ హవా అలానే కొనసాగే అవకాశం ఉంది. సినిమాకు మంచి టాక్ వచ్చి ఎక్కువ రోజులు నిలబడేట్లయితే ఆ తర్వాత కూడా కలిసి మరో సెలవు కలిసి వస్తుందని అందరూ భావిస్తున్నారు. 17వ తేదిన శ్రీరామ నవమి పండగ ఉండటంతో రెండో వారంలో కూడా సినిమాను చూస్తేందుకు చాలా మంది థియేటర్లకు రానున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -