Nara Devansh: ఆ విషయంలో దేవాన్ష్ గ్రేట్.. అలా చేస్తున్నాడా?

Nara Devansh: నందమూరి కుటుంబం అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాలతో తెలుగు వాళ్లందరికీ ఎంతో సుపరిచితం. నందమూరి నట వారసత్వాన్నే కాకుండా, రాజకీయ వారసత్వాన్ని నందమూరి బాలయ్య కొనసాగిస్తున్నాడు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క హిందుపురం ఎమ్మెల్యేగా ప్రజా సేవలో బాలయ్య తలమునకలై ఉన్నాడు. ఇక బావ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉంటున్న బాలయ్య.. వీలు కుదిరినప్పుడు తన మనవడు దేవాన్ష్ తో గడుపుతూ ఉంటాడు.

 

నారా వారి కుటుంబం నుండి వచ్చిన క్రమశిక్షణకి తోడు, నందమూరి కుటుంబం నుండి అబ్బిన గుణాలు నారా దేవాన్ష్ ను ఎంతో స్పెషల్ చేశాయనే టాక్ ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు. నందమూరి బాలయ్య కూతురు బ్రాహ్మణికి, నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కు పుట్టిన దేవాన్ష్ ని చూసిన వాళ్లంతా ఆ పిల్లోడిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారట.

 

నారా కుటుంబానికి చెందిన చంద్రబాబు, లోకేష్ లు రాజకీయాల్లో బిజీగా ఉంటే, అదే కుటుంబానికి చెందిన ఆడవాళ్లు వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. అయితే నారా కుటుంబంలో పెరుగుతున్న దేవాన్ష్ విషయంలో మాత్రం అందరూ ఎంతో జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం. నారా దేవాన్ష్ కు చిన్నప్పటి నుండే మంచి అలవాట్లు వచ్చేలా చాలా కేరింగ్ గా అందరూ చూసుకుంటున్నారట.

 

నారా వారి ఇంటికి ఎవరు వచ్చినా నారా దేవాన్ష్ ఎంతో గౌరవంగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడట. తన బుజ్జిబుజ్జి మాటలతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు వచ్చిన వారంతా తనకు ఫిదా అయ్యేలా దేవాన్ష్ చేస్తున్నాడనే టాక్ నడుస్తోంది. దీంతో నందమూరి, నారా వారి పేరును దేవాన్ష్ ఇప్పటి నుండే మారు మోగేలా చేయడంతో పాటు ఇరు కుటుంబాల పేర్లను మరింత ఎదిగేలా చేస్తున్నాడట. మొత్తానికి దేవాన్ష్ తో మాట్లాడిన ఎవరైనా అతడి మాటలకు ముగ్దులు కావాల్సిందేననే మాటలు ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -