Manchu Manoj: ఆ ప్రముఖ నటిని మంచు మనోజ్ అమ్మ అని పిలుస్తారా?

Manchu Manoj: తెలుగు సినిమాల్లో మనకు అమ్మ పాత్రల్లో ఎక్కువగా కనిపించేవారిలో నటి సుధ కూడా ఒకరు. ఒక్క తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఈమె అమ్మ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మదిలో మంచి మార్కులు సంపాదించారు. 30 ఏళ్ల క్రితం నటి సుధ తన కెరీర్ ను ప్రారంభించారు. ఇప్పటి వరకూ దాదాపు 800 సినిమాల్లో ఆమె నటించారు. స్టార్ హీరోలందరికీ అమ్మగా కనిపించారు.

 

ఈ మధ్య కాలంలో ఆమెకు వరుస సినిమా అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం కూడా ఉంది. అమ్మ పాత్రల్లో బూతు పదాలు పలికిస్తున్నారని నటి సుధ ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే చాలా వరకూ సినిమాలు తగ్గిపోయాయని అంటోంది. ఆర్థికంగా ఆమె ప‌రిస్థితి బాగానే ఉన్నా అనుకున్న వ్యక్తులే తనను మోసం చేశారని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. తన కుటుంబ సమస్యల వల్ల తాను చెన్నైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది.

 

ప్ర‌స్తుత తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో అమ్మ పాత్ర అన‌గానే వెంటనే నటి సుధ గుర్తుకు రాక మానదు. కెరీర్ మొదట్లో ఆమె హీరోయిన్ గానే అడుగు పెట్టాల్సి ఉంది. అయితే ఆ క్రమంలో ద‌ర్శ‌క దిగ్గ‌జం అయిన బాల‌చంద‌ర్ సూచ‌న‌ల మేర‌కు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. ఆ పాత్రలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకురావడంతో అప్పటి నుంచి నటి సుధ అమ్మ పాత్రల్లో కనిపిస్తూ ఉన్నారు.

 

త‌న‌కంటే వ‌య‌స్సులో పెద్ద వాళ్లు అయిన స్టార్ల‌కు కూడా సుధ అమ్మ‌గా నటించి మెప్పించారు. నువ్వునాకు న‌చ్చావ్ సినిమాలో వెంకీకి అత్త‌గా, మ‌న్మ‌థుడు సినిమాలో నాగార్జున‌కు పిన్నిగా కూడా చేయడంతో నటి సుధకు మంచి మార్కులు పడ్డాయి. సీనియ‌ర్ ఎన్టీఆర్ మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాలో ఆయ‌న‌కు కూతురుగా న‌టించారు. మంచు మనోజ్ కు తానంటే చాలా ఇష్టమని, తనను షూటింగ్ సెట్లో చూసి మమ్మీ మమ్మీ అంటూ మాట్లాడేవాడని, సుధ భోజనం పెడితేగానీ మనోజ్ ఏడుపు ఆపేవాడు కాదని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -