Chiranjeevi Love: ఏడో తరగతిలోనే చిరంజీవి అలాంటి పనులు చేశారా?

Chiranjeevi Love: మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేనిది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయన తీసిన సినిమాలు, వేసిన డ్యాన్స్ స్టెప్పులు అద్భుతమనే చెప్పాలి. అప్పట్లో అందరికంటే ఎక్కువగా చిరంజీవి ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని వసూళ్లను రాబట్టేవి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కూడా చిరంజీవి ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదగడం గొప్ప విషయం అని చెప్పాలి.

చిరంజీవి ఇలా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయ్యాడంటే అది ఒక్క రోజులో జరిగిన పని కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులను ఆయన గడిపారు. చిరంజీవిపై అప్పట్లో ఏ రూమర్లు రాకుండా ఉండేవి. ఏ హీరోయిన్ తో కూడా ఆయనకు ఎఫైర్లు ఉన్నట్లు, ప్రేమలో పడ్డట్లు వార్తలు ఉండేవి కావు. క్రమశిక్షణకు మారుపేరుగా ఆయన ఉండేవారు. అందుకే ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఆయన ఉన్నారు.

అయితే చిరంజీవికి కూడా ఓ ప్రేమ కథ ఉందని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అమీర్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన లాల్‌ సింగ్ చద్దా మూవీని చిరంజీవి సమర్పణలో తెలుగులో రిలీజ్‌ చేయగా ఆ టైంలో ఆయన తన లవ్ గురించి తెలిపాడు.

తాను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ప్రేమలో పడినట్లు చిరంజీవి తెలిపారు. ఒక అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే అప్పట్లో మా మొగల్తూరులో అందరూ చాలా వింతగా చూసేవారని, అలాంటి టైంలో ఓ అమ్మాయి మాత్రం ధైర్యంగా సైకిల్‌ తొక్కుతూ వచ్చేదని, ఆమె అంటే తనకు చాలా ఇష్టమని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఆమె ఎలా సైకిల్‌ తొక్కుతుందా అని తాను కూడా తిరిగి చూసేవాడినని, ఆ సమయంలో ఆమె తన తలను తిప్పేసి ముందు చూడమని చెప్పేదని, కొన్నాళ్లకు ఆమె దూరంగా వెళ్లిపోయిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -