ఇంట్లో చీపురు అలా ఉంచితే నాశనమే.. ఎలా పెట్టాలంటే?

చాలామంది చాలా నమ్మకాలు ఉంటాయి. వీటిని పాటించేవారు కొంతమంది ఉంటారు. మరికొంతమంది మాత్రం ఇవి మూఢనమ్మకాలు అంటూ పట్టించుకోరు. కొంతమంది మాత్రం వీటిని సెంటిమెంట్ గా తీసుకుని నమ్మకాలను తూచా తప్పకుండా పాటిస్తారు. పాటించకపోతే ఏదో నష్టం జరుగుతుందని నమ్ముతారు. ఇంటి వాస్తు, జాతక బలం.. గ్రహ బలం.. ఇలాంటి వాటిని చాలామంది నమ్ముతారు.

ఇక ఇంట్లో ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలి.. ఎలా పెట్టాలని అనేవి కూడా వాస్తులో చెబుతారు. ఇంట్లో నిత్యం ఉపయోగించే చీపురు ఎక్కడ పెట్టాలి.. ఎలా పెట్టాలని అనే విషయాలు కూడా ప్రభావితం చేస్తాయట. చాలామందికి తెలియక ఎక్కడ పడితే అక్కడ వేస్తారని, అలా చేస్తే నష్టపోతారని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంటిని చీపురుతో శుభం చేసుకునేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వపుకు చిమ్మి చెత్తను పోగు చేయాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈశాన్యం వైపు చెత్తను తీసుకురాకూడదని, ఈశాన్యం వైపు చెత్తను పొగు చేస్తే ఆ ఇంట్లో సంపద నిలకడగా ఉండదని అంటున్నారు.

ఈశాన్యంలో దర్వాజా తప్ప ఏ వైపు డోర్ వెనుకవైపు అయినా సరే గోడకు మేకు కొట్టి చీపురు హ్యాండిల్ వైపు వచ్చేలా పెట్టాలని వాస్తు పండిుతులు చెబుతున్నారు. చీపురు రివర్స్ వైపు పెడితే శని దేవుడిని నిలుపుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు. చీపురుని ఇంటికి వచ్చిన అతిధులకు కనబడకుండా ఉంచాలని చెబుతున్నారు. డోర్ వెనుక భాగంలో పెట్టుకుంటే మంచిదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. కొంతమంది చీపురే కదా ఎక్కడ పెడతే ఏమి అవుతుందిలే అని అనుకుంటారని, దాని వల్ల సర్వనాశనం అవుతారని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో కలిసి రాదని, నష్టపోతారని వాస్తు జ్యోతిష్యులు చెబుతున్నారు. పైన చెప్పివని పాటించడం ద్వారా మీకు మంచి జరుగుతుందని, లాభాలు జరుగుతాయి వాస్తు పండితులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -