Tollywood: ఆ స్టార్ హీరోలకు మధ్య తేడా అదేనా?

Tollywood: గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో అవకతవకలు జరుగుతున్నాయని చాలా మంది చర్చించుకుంటున్నారు. స్టార్ హీరో విషయంలో ఏపీ సర్కార్ కొన్ని కఠిన నియమాలు పెడుతూ వారిని ఇబ్బంది పెడుతోందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తాజాగా నందమూరి బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాాలా హంగామా జరిగింది. మొదటగా ఒక దగ్గర అనుకున్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆ తర్వాత వేరే చోటుకు మళ్లించారు. ఏపీ సర్కార్ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఆ తర్వాత వీరసింహారెడ్డి టీమ్ 24 గంటల టైమ్ లోనే ఒంగోలులో పర్మిషన్ తీసుకుని ఈవెంట్ ను ఘనంగా చేసింది. స్టేజిపై బాలయ్య మాట్లాడుతూ నిర్మాతలకు సినిమాలంటే ఒక ఫ్యాషన్ అని, ఆ ఫ్యాషన్ వల్ల ఇంత వరకూ వచ్చినట్లు తెలిపారు. శ్రేయస్ మీడియాని బాలయ్య పొగడ్తలతో ముంచెత్తారు. చివరి నిమిషంలో ఈవెంట్ వేదిక మార్చినా సరే అభిమానులకు ఇబ్బంది కలగకుండా అద్భుతమైన స్టేజిని 24 గంటల వ్యవధిలోనే తయారు చేసినందుకు శ్రేయస్ శ్రీనివాస్ టీమ్ ని ప్రశంసించారు.

 

తనని ఇబ్బంది పెట్టిన వాళ్లకి బాలయ్య గట్టిగానే కౌంటర్ ఇస్తారు. తన సినిమా ట్రైలర్ లోనూ ఏపీ ప్రభుత్వానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ.. ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు..మార్చలేరు “అనే డైలాగ్ తో బాలయ్య కుమ్మేశాడు. బాలయ్య నోటి నుంచి వచ్చిన ఆ డైలాగ్ విని ప్రతి ఒక్కరూ ఎవరిని టార్గెట్ చేశారో ఇట్టే తెలుసుకున్నారు.

 

మెగాస్టార్ చిరంజీవిని సైతం ఏపీ సర్కార్ అదేవిధంగా ఇబ్బంది పెడుతూ వచ్చింది. కానీ చిరంజీవి మాత్రం ఎటువంటి విధంగా పరోక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా ఉన్నారు. ఏపీ సర్కార్ పై కౌంటర్ కూడా వేయలేదు. ఈ క్రమంలోనే బాలయ్య అనుకుంటే ఏదైనా సాధిస్తారని, ఎలాంటి వాళ్లకైనా సరే ఇచ్చిపడేస్తాడని, చిరంజీవి అలా చేయడానికి భయపడతాడని, సైలెంట్ గా తన పనేదో తాను చేసుకుపోతాడని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -