Nandamuri Heir: బాలయ్య, తారక్, మోక్షజ్ఞలో నిజమైన వారసుడు ఎవరంటే?

Nandamuri Heir: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా గుర్తింపు సాధించుకున్న కుటుంబాల జాబితాలో ముందుగా ప్రస్తావించాల్సిన కుటుంబం నందమూరి కుటుంబం. ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే ఓ వ్యక్తి సినిమాల మీద మక్కువతో ఉద్యోగాన్ని వదిలి చెన్నైకి పయనమై అక్కడ అవకాశాలు సాధించి.. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించే లెజెండరీ యాక్టర్ గా నందమూరి తారకరామారావు గుర్తింపు సాధించాడు.

తెలుగులో ఓ రాముడు అన్నా, ఓ కృష్ణుడు అన్నా అందరికి ముందుగా గుర్తుకువచ్చే రూపం నందమూరి తారకరామారావు గారి రూపం. సినీ రంగంలో ఆయన చేసినన్ని ప్రయోగాలు వేరే ఎవరూ చేయలేదు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా అన్ని రకాలుగా తాను లెజెండ్ అని నిరూపించుకున్నాడు. అయితే తెలుగు ప్రేక్షకులు ఆయనను కేవలం నటుడిగా కాకుండా దేవుడిగా కొలిచే వారు.

తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఎన్టీఆర్ సొంతంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అతి తక్కువ కాలంలోనే అధికారాన్ని చేపట్టి దేశంలో సంచలనం సృష్టించారు. తెలుగువారి కీర్తి పతాకాన్ని ఎగరవేసేలా రాజకీయ సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్.. తన వారసత్వం గురించి ఏం చెప్పారనేది ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

ఎన్టీఆర్ తన వారసులు సినిమా ఇండస్ట్రీలో ఉండకపోయినా పర్లేదు కానీ తన రాజకీయ లక్ష్యాలను నెరవేర్చాలని, టీడీపీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకున్నారట. కాబట్టి ఎన్టీఆర్ వారసులు అనిపించుకోవాలంటే ఆయన అనుకున్న రాజకీయ లక్ష్యాలను నెరవేర్చడంతో పాటు టీడీపీ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో ఎవరైతే కష్టపడతారో వాళ్లే నిజమైన నందమూరి వారసులు అనే టాక్ నడుస్తోంది. మరి నందమూరి బాలయ్య, ఎన్టీఆర్, మోక్షజ్ఞలలో ఎవరు నిజమైన వారసులుగా తేలతారనేది కాలమే నిర్ణయిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -