Acharya: ఆచార్య సెట్ కాలడం వల్ల అన్ని రూ.కోట్ల నష్టమా?

Acharya: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమా చిరంజీవి కంబ్యాక్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆచార్య సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ ధర్మస్థలి అనే ఒక భారీ టెంపుల్ సెట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. ఇందులో షూటింగ్ కూడా జరిగింది. అంతే కాకుండా సినిమాలోని చాలా సన్నివేశాలు ఎక్కువగా అక్కడే జరిగాయని చెప్పవచ్చు. సినిమాలోని ఎక్కువ సన్నివేశాలు ఆ టెంపుల్లోనే షూట్ చేయాల్సి ఉండడంతో కొరటాల శివ భారీ ఖర్చుతో ఈ టెంపుల్స్ ని హైదరాబాదులోని కోకాపేట లో నిర్మించారు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. సినిమా డిజస్టర్ అయినప్పటికీ ఆ సెట్ ని తీసేయకుండా అలాగే ఉంచేశారు. కానీ తాజాగా సోమవారం సాయంత్రం టెంపుల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆచార్య ధర్మస్థలి టెంపుల్ సెట్ మొత్తం మంటల్లో కాలిపోతున్నట్లుగా చూపుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆచార్య సెట్ కి మంటలెలా అంటుకున్నాయి అనేది ఆ వీడియో బ్యాగ్రౌండ్ లో వినిపిస్తున్నాయి.

 

ఆ సెట్ అగ్నిప్రమాదానికి గురవడానికి కారణం ఆ టెంపుల్ సెట్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద కూర్చొని ఎవరో సిగరెట్ కాల్చారని, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే సెట్‌లో మంటలు చెలరేగాయంటూ ఆ వీడియో తీసిన వారు మాట్లాడుకోవడం అందులో వినిపించింది. అంటే జస్ట్ ఓ సిగరెట్ 20 కోట్ల సెట్ ని అగ్నికి ఆహుతి చేసింది. 20 ఎకరాల్లో 20 కోట్లతో నిర్మించిన ఈ సెట్ ని సురేష్ సెల్వరాజన్ నిర్మించారు. మరి ఆ సెట్ కాలడానికి 20 నిముషాలు కూడా పట్టలేదనే కామెంట్స్ నెటిజెన్స్ నుండి వినిపిస్తున్నాయి. మొత్తానికి కొరటాల శివ కష్టము, డబ్బు అన్నీ కూడా బుడుదల పోసిన పన్నీరు మాదిరిగానే బూడిద అయిపోయాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -