Project K: ప్రాజెక్ట్ కె షూటింగ్ లో ఘోర ప్రమాదం.. అమితాబ్ కు తీవ్ర గాయాలతో?

Project K: టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కె. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ ప్రాజెక్ట్ కె షూటింగ్ లో ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. నటుడు అమితాబ్ బచ్చన్ కు గాయాలయ్యాయి.

 

కాగా హైదరాబాద్‌ లో జరుగుతున్న ప్రాజెక్ట్ కె షూటింగ్ లో ఆయన కొన్ని రోజులుగా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో ఓ యాక్షన్‌ సీన్ నిర్వహిస్తుండగా ఆయనకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైరల్‌ అవుతోంది. ఇదే విషయాన్ని అమితాబ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. నేను షూటింగ్ లో గాయ పడ్డాను. నా పక్కటెముక మృదులాస్థి విరిగిపోయింది. కుడి పక్కటెముకకు కండరాల చీలికలా వచ్చింది. షూటింగ్ క్యాన్సిల్ అయింది.

హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో సీటీ ద్వారా డాక్టర్ ను సంప్రదించి స్కానింగ్ చేయించి ఇంటికి పంపించారు. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బందిగా ఉంది. కోలుకోవడానికి రెండు వారాలు పడుతుందని తెలిపారు అని రాసుకొచ్చాడు అమితాబ్ బచ్చన్. వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ వార్త విన్న అభిమానులు అమితాబ్ బచ్చన్ పరిస్థితి తలచుకొని ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన కారణంగా షూటింగ్ నిలిపివేసినట్టు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -