Bhuma Mounika: భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ క్లారిటీ ఇదే!

Bhuma Mounika: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో మంచు మనోజ్ ఇటీవలే రెండో పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు. దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కూతురైన మౌనిక రెడ్డిని కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల నుండి వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుందని జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

 

మొత్తానికి ఆ వార్తలను నిజం చేసేసారు ఈ జంట. అయితే ఈ పెళ్లి వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని బాగా వార్తలు వస్తున్నాయి. అది కూడా రాజకీయపరంగా మంచు మనోజ్ ఎంట్రీ ఉంటుంది అని రకరకాలుగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా భూమా మౌనిక కూడా తన తండ్రి పార్టీ తరపున ప్రచారం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

కానీ ఈ విషయం గురించి మొన్నటి వరకు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కనీసం మౌనిక రెడ్డి కూడా ఈ విషయం గురించి స్పందించలేదు. ఇక మౌనిక బాధ్యతలు మనోజ్ చేతిలో పడటంతో.. వెంటనే మనోజ్ తన భార్య పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడని తెలిసింది. అంతేకాకుండా ఆమె రాజకీయాల్లో సక్సెస్ కావడం ఖాయమని అన్నాడని.. పైగా ఆమె ఎమ్మెల్యే అవుతుందని .. మంత్రి కూడా అవుతుందని అన్నట్లు తెలుస్తుంది.

 

ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఒకవేళ భూమా మౌనిక రెడ్డి రాజకీయంలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం.. మనోజ్ అభిమానులంతా ఆమెను గెలిపించడం ఖాయమని తెలుస్తుంది. మామూలుగా మంచు ఫ్యామిలీలో విష్ణు, మోహన్ బాబు, లక్ష్మీ కంటే ఎక్కువగా మనోజ్ కు అభిమానం ఉందని చెప్పాలి. ఎవరు కూడా ఈయనపై ట్రోలింగ్స్ చేయరు. కానీ ఆ మిగతా ముగ్గురిపై మాత్రం బాగా ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ఇక మనోజ్ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడంతో ఈయనపై మరింత గౌరవం పెంచుకున్నారు అభిమానులు. ముఖ్యంగా మౌనిక కొడుకుని తన సొంత కొడుకు లాగా చూసుకోవటం అనేది అందరిని ఆకట్టుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -