NTR: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న గురించి అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎన్టీఆర్ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించారు. అంతేకాకుండా 1975 వరకు కూడా డ్యూయెట్ లలో రొమాన్స్ సీన్ లలో కాన చాలా ఆచితూచి వ్యవహరించేవారు. ఆ తరువాత 1978 – 1990ల మధ్య మాత్రం ఎన్టీఆర్ గారి దూకుడు పెరిగింది.
హీరోయిన్లను నలిపేస్తాడని, పట్టుకుంటే వదిలి పెట్టడని కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అప్పట్లో ఇదే విషయంపై ఎన్నో రకాల రూమర్లు కూడా వినిపించాయి. అలా వేటగాడు సినిమా నుంచి అనేక సినిమాల్లో జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి హీరోయిన్లతో రొమాన్స్ సీన్లలో అన్నగారు జీవించేవారు అంటూ వార్తలు కూడా జోరుగా వినిపించాయి. అటువంటి వార్తలు, ప్రచారాలు జరిగినప్పుడు వెంటనే ఆ కథనాలు రాసిన జర్నలిస్టులకు ఫోన్ చేసి.. ఇది నా తప్పుకాదు.. సీన్ డిమాండ్ చేసింది.
పైగా.. ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది అని చెప్పేవారట. కాగా ఎన్టీఆర్ సినిమాలలో మాత్రమే కాకుండా ఇతర హీరోల సినిమాల నుంచి కూడా ప్రేక్షకులు అదే ఎక్కువగా కోరుకోవడంతో అప్పట్లో అలాంటి సినిమాలో ఎక్కువగా వచ్చాయి. అలాగే యువత కోరికలు కూడా బాగా పెరిగాయి. సినిమాలపై యాక్సెప్టేషన్స్ మరింత పెరిగాయి. దీంతో కొన్ని కొన్ని రొమాన్స్ సీన్లలో హాట్ సీన్లు తప్పేవి కాదు. అవిలేకపోతే యూత్ నుంచి విజిల్స్ వచ్చేవి కాదని చెప్పుకొనేవారు.