Salaar: సలార్ మూవీ స్టోరీ లీక్.. వామ్మో ఇన్ని ట్విస్టులా?

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఫ్యాన్స్ కు అద్భుతమై ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. సాహో, రాధే శ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆ రెండు సినిమాలు ఫ్యాన్స్ ను నిరాశ పరిచాయి. అందుకే అభిమానుల కోసం నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు ప్రభాస్ సిద్దమయ్యాడు. వరుస షూటింగులు చేస్తూ బిజీ అయిపోయాడు.

 

నిర్మాతలు రిలీజ్ చేయాలనుకున్న సమయానికే మూవీ రిలీజ్ అయితే మాత్రం ప్రభాస్ సినిమాలు కేవలం ఏడెనిమిది నెలల్లోనే మూడు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆది పురుష్ జూన్ లో కచ్చితంగా రిలీజ్ చేస్తామని డైరెక్టర్ ఓం రౌత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ఆ సినిమా నిర్మాణ సంస్థ అయిన టీ సిరీస్ కూడా ఆది పురుష్ మూవీ కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది.

ఇకపోతే ప్రభాస్ చేస్తోన్న మరో సినిమా సలార్. ఇది డెబ్బై శాతానికి పైగానే షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. సలార్ రెండు భాగాలుగా వస్తోందనే వార్త తెలిసి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ఇది రెండు పార్టులుగా వస్తోందని ఇంకా క్లారిటీ రాలేదు. టీజర్ లేదా ట్రైలర్ లాంచ్ రోజు రెండు పార్టులు ఉండే విషయాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. లేకుంటో సినిమా చివర్లో చెప్పొచ్చు కూడా. ఈ సినిమా గురించి ఇంకో లీక్ ఏంటంటే ప్రభాస్ ఇందులో డ్యూయల్ రోల్ లో చేస్తున్నాడు.

 

సలార్ సినిమాలో ముఖ్యమైన పాత్ర పేరు సలార్ అయితే కొడుకు క్యారెక్టర్ దేవా అని తెలుస్తోంది. ఇందులో ఒకరికి జగపతి బాబు విలన్ అని మరొకరికి పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ అనే లీక్ బయటికొచ్చింది. అయితే బాహుబలిలాగా ఇద్దరు ప్రభాస్ లు ఒకే ఫ్రేమ్ లో కలుసుకునే అవకాశం ఉంటుందో లేదోననే విషయం సస్పెన్స్ గానే ఉంచారు. సలార్ పై అభిమానులకు భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -