NTR: బాలయ్యకు మాటిచ్చిన ఎన్టీఆర్.. బాబాయే ప్రాణమంటూ?

NTR: నందమూరి మోక్షజ్ఞ చాలాకాలం నుంచి ఈ హీరోపేరు నందమూరి అభిమానుల్లో నానుతోంది.బాలకృష్ణ తనయుడైన మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని చాలామంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.అంతేకాదు మోక్షజ్ఞ చేసే సినిమా బాలకృష్ణ దర్శకత్వంలో ఉంటుందని, కొంతమంది ఆ సినిమాలో బాలకృష్ణ కీలకపాత్రలో నటిస్తారని, మరికొందరు బాలయ్య విలన్ పాత్ర పోషిస్తారంటూ ఇప్పటికే ఎన్నో ప్రచారాలు చేశారు.

మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఆలస్యంగా ఉంటుంది కానీ ఆయన సినీ పరిశ్రమకు రావడం మాత్రం పక్కా అని, అతను కూడా కూడా నందమూరి హీరోలలో ఒకరిగా విజయవంతమవుతాడని ఓ జ్యోతిష్యుడు తెలిపారు. నందమూరి కుటుంబంలో సినిమాతోపాటు రాజకీయం కూడా ఉంటుందని,అయితే మోక్షజ్ఞ రాజకీయాల్లోకి వెళ్లినా అంతగా ఫలితం ఉండదని చెప్పారు.రాజకీయాలు మోక్షజ్ఞ కు అచ్చిరావని, సినిమాల్లో మాత్రం పెద్ద స్టార్ అవుతాడని కాకపోతే రావడం ఆలస్యమవుతుందని చెప్పారు.అతను కూడా అతని తండ్రిలాగే మంచి స్టార్ డమ్ సంపాదించుకుంటారంటూ వేణుస్వామి మోక్షజ్ఞ జాతకం గురించి,సినీ కెరీర్ గురించి,రాజకీయ కెరీర్ గురించి చెప్పుకొచ్చారు.

 

మరోవైపు ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999’సినిమాలో మోక్షజ్ఞ నటిస్తారని ఇలా ఎన్నో వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.మోక్షజ్ఞ తన కన్న కొడుకు కంటే ఎక్కువని నటనకు సంబంధించి టిప్స్ చెప్పడంతో పాటు మోక్షజ్ఞ కెరీర్ పరంగా ఎదిగేలా చూసుకుంటానని ఎన్టీఆర్ మాట ఇచ్చినట్టు సమాచారం. దీనిపై ఎన్టీఆర్ అభిమాలు అభినందనలు కూడా తెలుపుతున్నారు. ఇది రా మా అన్న మంచితనం అంటున్నారు కూడా.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -