NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వార్త వింటే మాత్రం గూస్ బంప్స్ పక్కా!

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి కుటుంబం నుండి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్ ఆర్ సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

 

ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. చాలాకాలం వాయిదా పడిన ఈ సినిమా ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఈ సినిమా షూటింగ్ అనేక కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది.

ఇలా ఈ సినిమా వాయిదా పడటంతో ఎన్టీఆర్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త వెలువడింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ 30 అనే సినిమా తొందర్లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 23వ తేదీన ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి 29వ తేదీ వరకు రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.

 

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించనుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయటానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రశాంత నీల్ ఆ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ కోసం పాన్ వరల్డ్ రేంజ్ లో కథ సిద్దం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

 

భారీ యాక్షన్ డ్రామా గా ఈ సినిమాని ప్రశాంత్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ నుండి నటి నటులను తీసుకురావడమే కాకుండా టెక్నీషియన్స్ ని కూడా హాలీవుడ్ నుండి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మరింత గుర్తింపు సొంతం చేసుకుంటాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఎన్టీఆర్ 31 గురించి ఈ క్రేజీ న్యూస్ బయటకు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Tuni Assembly Constituency: తుని నియోజకవర్గంలో కూటమికి తిరుగులేదా.. యనమల కుటుంబానిదే విజయమా?

Tuni Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కూటమిలో కాస్త ఆ నియోజకవర్గం సీటు ఎవరిదనే విషయంపై కాస్త గందరగోళం ఉండేది. అయితే పంపకాలలో తుని నియోజకవర్గం తెదేపాకి దక్కింది. ఈ...
- Advertisement -
- Advertisement -