Shekar Master: వైరల్ అవుతున్నశేఖర్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

Shekar Master: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి సదా ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి డాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె స్టార్ మాలో ప్రసారమవుతున్న బిబి జోడి డాన్స్ షోలో తరుణ్ మాస్టర్ నటి రాధాతో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లు జోడీలుగా ఏర్పడి వారి అద్భుతమైన పర్ఫామెన్స్ లతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రతి శని ఆదివారం ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమం ఫైనల్ కు చేరుకుంది. ఈనెల 25 26వ తేదీలలో ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరగనుంది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ హాజరయ్యారు.

 

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమో కాస్త వైరల్ అవుతుంది.ఇక ఈ ప్రోమోలో భాగంగా శేఖర్ మాస్టర్ వచ్చి రాగానే తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో సందడి చేశారు. ఇక చాలా రోజుల తర్వాత ఈయన నటి సదాతో కలిసి ఒకే వేదికపై సందడి చేశారు. గతంలో వీరిద్దరూ ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో సందడి చేసేవారు.

 

ఇక ఈ ప్రోమోలో భాగంగా మెహబూబ్ శ్రీ సత్య అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు. వీరి పర్ఫామెన్స్ గురించి నటి సదా మాట్లాడుతూ నాకు చాలా బాధగా ఉంది మెహబూబ్.ఇకపై నేను నీ సిక్స్ ప్యాక్ చూడలేను అంటూ సదా చెప్పగా వెంటనే స్పందించిన శేఖర్ మాస్టర్ నీకు చూడాలనిపిస్తే వెంటనే వీడియో కాల్ చెయ్ అంటూ సదాకు సెటైర్ వేశారు. ఇలా శేఖర్ మాస్టర్ సదాకు సెటైర్ వేయడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -