Dwcra Women: ఏపీలో డ్వాక్రా మహిళలకు అకౌంట్‌లలో డబ్బు.. వివరాలివే!

Dwcra Women: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్తను తెలియజేస్తోంది.2019 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అప్పటివరకు అప్పులు తీసుకున్నటువంటి డ్వాక్రా మహిళల అప్పులను తిరిగి వెనక్కి చెల్లిస్తామంటూ జగన్ హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వైయస్సార్ ఆసరా పేరుతో మహిళలు చెల్లించిన రుణాలను తిరిగి నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పటికే ఈ డబ్బులను రెండు విడుదలగా ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఖాతాలోకి జమ చేసింది.

ఇకపోతే మూడో విడత కార్యక్రమంలో భాగంగా మార్చి 25వ తేదీ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈనెల 25న ఏలూరు జిల్లా దెందులూరులో జరిగే కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి డ్వాక్రా మహిళల ఖాతాలలో డబ్బు జమ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని 10 రోజులపాటు అనగా ఏప్రిల్ 5వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

 

2019 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు జగన్ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.12,758 కోట్ల రూపాయలను అర్హుల ఖాతాలలో జమ చేశారు. ఇక మూడో విడత కార్యక్రమంలో భాగంగా 78.94 మంది డ్వాక్రా మహిళల ఖాతాలలో రూ.6149 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. ఇక ఈ విషయం గురించి ఏ మహిళకు ఎంత లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని కూడా తెలియజేశారు.

 

మార్చి 14 నుంచి 17 వరకు గ్రామ వార్డు వాలంటీర్లు, గ్రామ సమాఖ్య సహాయకులు, పట్టణ రిసోర్స్ పర్సన్లు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మూడో విడతలో భాగంగా ఒక్కో మహిళకు ఎంత లబ్ధి చేకూరుతుందో కూడా తెలియజేశారు. ఈ విధంగా వైయస్సార్ ఆసరా పేరుతో జగన్ ప్రభుత్వం డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్నటువంటి రుణాలను చెల్లిస్తోంది. ఇక ఈ కార్యక్రమం 10 రోజులపాటు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ జరగనుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -