Jagan: జగన్ ను దారుణంగా మోసం చేసిన ఎమ్మెల్యేలు ఎవరో తెలుసా?

Jagan: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. మొత్తం 7 స్థానాల్లో విజయం సాధించాలనే వైసీపీ ఆశలపై క్రాస్‌ ఓటింగ్‌ నీళ్లు చల్లింది. వైసీపీ నుంచి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు క్రాస్ ఓటింగ్ చేయడంతో ఆమె విజయం సాధించారు. అయితే క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినవారిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి‌ ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

అయితే దీనిపై ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. మేకపాటి అనధికారికంగా స్పందించగా, శ్రీదేవి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఈ రోజు తన కూతురితో కలిసి  తాను సీఎం జగన్‌ను కలిశానని చెప్పారు. తన కూతురిని మంచిగా చదవమని కూడా జగన్ చెప్పారని తెలిపారు. తాను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందే జగన్ అని గుర్తుచేశారు. తమది వైసీపీ కుటుంబం అని అన్నారు.  తాను క్రాస్‌ ఓటింగ్ వేశానని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. రహస్య ఓటింగ్ జరిగిందని తాను క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్టుగా ఎలా అంటారని మండిపడ్డారు.

 

అయితే పార్టీలోని అసంతృప్తి కారణంగానే వీరిద్దరు క్రాస్ ఓటింగ్ కి పాల్పడినట్లు టీడీపీ భావిస్తుంది. జగన్ ఎమ్మెల్యేలను అసలు పట్టించుకోరని, నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమని అంటున్నారు. ఇప్పటికే నెల్లూరు రెడ్లు దీనిపై స్పందించి పార్టీపై ధిక్కార స్వరం కూడా వినిపించారు. వీరిద్దరూ తమ ఓటుతో వైసీపీ అధినేత జగన్ కు బుద్ధి చెప్పారని తెలిసింది. అటు పార్టీ సలహాదారు సజ్జల కూడా ఇదే విధమైన కామెంట్ చేశారు. కానీ వారిపై చర్యలు ఉండవనటం గమనార్హం.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -