KCR: ఈ విషయంలో సీఎం కేసీఆర్ కు ఎవరూ సాటి రారుగా!

KCR: ఇటీవలి అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎకరానికి రూ.10 వేలు సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. సాగులో వాస్తవ రైతు ఉంటే అతనికి, కౌలు రైతులుంటే వారికే పరిహారాన్ని ఇస్తామని చెప్పారు.

కేంద్ర పథకంలో ఎకరం మొక్కజొన్నకు 3,333 పరిహారాన్ని చూపించారని, వరికి 5 వేల 400, మామిడికి 7 వేలు సూచించారని, ఇవి రైతులకు ఏ మూలకు సరిపోవని, పెరిగిన పెట్టుబడులు, జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని రైతులు కోలుకునేలా ఎకరానికి రూ.10 వేలు అందిస్తామని ప్రకటించారు.

 

కేంద్రానికి నివేదికలు పంపినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని కేంద్రానికి నివేదికలు పంపేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.పంట నష్టంపై గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఎలాంటి సాయం చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే ఇండియాలోనే ఫస్ట్ టైం కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని స్పష్టం చేశారు.మొత్తం 79 వేల ఎకరాల్లో వరి పంట నష్టానికి గురైందని సీఎం కేసీఆర్ తెలిపారు.

 

దేశంలోనే మొదటిసారి సహాయ పునరావాస చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందజేస్తామని, కౌలు రైతులను సైతం ఆదుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. వాళ్లక్కూడా న్యాయం చేస్తామన్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -