PM Kisan Scheme: పీఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

PM Kisan Scheme: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను ఆదుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలను తీసుకువస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ప్రతి ఏడాది రైతుల ఖాతాలలోకి 6000 రూపాయలను జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ డబ్బులను ఒకేసారి కాకుండా ఏడాదికి మూడు విడతలుగా 2000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తున్నారు.

 

ఇలా ఇప్పటికే ఈ పథకం ద్వారా రైతులు 13 విడుదలగా 2000 రూపాయలు చొప్పున డబ్బులు అందుకున్నారు.గత నెల 26వ తేదీ 13వ విడత పిఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేశారు. ఇక 14వ విడత డబ్బులను జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మూడవ వారంలో రైతుల ఖాతాలో జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే పీఎం కిసాన్ డబ్బులు కనుక మీకు తప్పనిసరిగా మీ ఖాతాలో జమ కావాలి అంటే మీరు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి. ఓటీపీ ఆధారిత కేవైసీ అందుబాటులో ఉంది. లేదు అంటే స్థానిక సీఎస్‌సీ కేంద్రాలకు వెళ్లి సైతం బయోమెట్రిక్ ఇ-కేవైసీ చేయించుకోవాలి ఇలా చేయించుకున్నప్పుడే మీరు పిఎం కిసాన్ డబ్బులు పొందడానికి అర్హులు. ఇలా ఇ-కేవైసీ చేయించుకున్న వారే అర్హులని ప్రభుత్వం వెల్లడించింది.

 

ఇక ఈ డబ్బులు పొందడానికి మీరు అర్హుల లేదా ఇందులో మీ పేరు ఉందా లేదా అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే ముందుగా మీరు పిఎం కిసాన్ అధికారక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తరవాత మీరు ఫార్మర్స్ కార్నర్‌లో బెనిఫిషియరీ లిస్ట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రాష్ట్ర, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, గ్రామం వివరాలు ఇవ్వాలి. గెట్ రిపోట్ ట్యాబ్‌ మీద క్లిక్ చేయాలి. లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. ఇందులో మీ పేరు ఉంటే ఈ డబ్బులు పొట్టడానికి అర్హులు. అలా పేరు కనుక లేకపోతే వెంటనే ఇ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -