Jagan: జగన్ జాగ్రత్త పడాల్సిందే.. లేకపోతే ఇబ్బందులు తప్పవట!

Jagan: ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ పేరే వినిపిస్తోంది. అంతేకాకుండా తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో చాలావరకు తెలుగుదేశం పార్టీ గెలవడంతో పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా సంతోషంగా ఆనందంగా కనిపిస్తున్నారు. గడిచిన నాలుగు ఏళ్ళలో చంద్రబాబు కళ్ళల్లో ఇంత ఆనందం చూడటం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.

 

అయితే తాడేపల్లి వైసీపీ రాజకోటలో తన వ్యూహాలు అమలవ్వటమే చంద్రబాబు నమ్మకానికి ఆనందానికి కారణం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పధకాల అమలు విషయం స్వయంగా సీఎం చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాటి వరకు చంద్రబాబు టచ్ చేయలేకపోయారు. అయితే రాజకీయాలలో ఏ రాజకీయపార్టీకి అయినా గ్రౌండ్ లెవెల్ నాయకత్వం అన్నది వెన్నుముక లాంటిది. సరిగ్గా ఇక్కడే చంద్రబాబు ఫోకస్ చేసారు. పదేళ్లు పార్టీ కోసం కష్టపడిన వైసీపీ గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ వార్డు స్థాయి నాయకులు, 2019లో పార్టీ అధికారంలోకి రాగానే, స్థానిక అధివృద్ది పనుల్లో భాగంగా, పలు రకాల కాంట్రాక్టు పనులు చేసారు.


దీని కోసం కొంత మంది అప్పులు తెచ్చి మరీ ఖర్చుపెట్టారు. కాగా ముఖ్యమంత్రి చుట్టూ ఒక వలయం ఏర్పాటుచేసి తప్పుడు సమాచారం అందేలా కొంత మంది జగన్ నమ్మకస్తులను మేనేజ్ చేయగలిగారు. వాళ్లతో వైసీపీ సోషల్ మీడియాని బలహీనపరిచేలా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనుల సమాచారాన్ని ప్రచారానికి నోచుకోకుండా, రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనే స్లోగన్ ని అన్ని వర్గాలలో బలంగా తీసుకెళ్లారు. ఇక్కడ చంద్రబాబు విజయం సాధించారు.

 

అయితే చంద్రబాబుకి ప్రజల్లో బలం లేకపోవచ్చు, కానీ మంత్రాంగం, యంత్రాంగం నడపటంలో కొట్టిన పిండి అని చెప్పవచ్చు. పధకాలు ఇస్తున్నాం, ఇక మనకి తిరుగులేదు అని పక్కన జరుగుతున్న కుట్రలను గమనించి తగు చర్యలు తీసుకోకపోతే 2014 సీన్ రిపీట్ అవుతుంది అనటంలో సందేహం లేదు. ఏది ఏమైనా చంద్రబాబు తెలివితేటలకు ఇంకా కాలం చెల్లలేదు అని మాత్రం గుర్తించాలి. చంద్రబాబు వ్యూహం తాడేపల్లి లో అమలు అయ్యి రిసల్ట్ కనపడేసరికి బాబు కళ్ళల్లో ఆనందం, గొంతులో ధైర్యం పక్కాగా కనపడుతున్నాయి. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడకపోతే ఇబ్బందులు పడక తప్పదు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -