Kriti Sanon: అబ్బో.. అందరి ముందు ప్రభాస్ కు ఫోన్ చేసి అలా మాట్లాడిన కృతిసనన్!

Kriti Sanon:  టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రభాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈశ్వర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వేరే స్థాయిలో హడావిడి చేస్తున్నాడు. ఇక బాహుబలి సినిమా తరువాత పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నాడు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ప్రభాస్ బిజీగా ఉన్నాడు.

అందులో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా.. కృతి సనన్ ప్రభాస్ కి కాల్ చేసి మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇంతకూ అసలు విషయం ఏంటంటే.. తాజాగా కాఫీ విత్ కరణ్ షో లో కృతి సనన్ పాల్గొంది. దీంట్లో ఒక రౌండ్ లో భాగంగా ఎవరైనా ఒక సెలబ్రెటీ కి ఫోన్ చేసి హే కరణ్ ఇట్స్ మీ అని చెప్పించాలనే రౌండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో భాగంగా కృతి ప్రభాస్ కు కాల్ చేసింది.

ఇక ఆ ఆడియో కాల్ లో ప్రభాస్ కృతి సనన్ తో కలిసి మాట్లాడిన మాటలు.. మొహమాట పడడం గమనించిన ప్రభాస్ ఫ్యాన్స్ మరో స్థాయిలో ఆనందిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆ వీడియో చూసి ఫుల్ గా చిల్ అవుతున్నారు. ఇక కృతి సనన్ హాయ్ ప్రభాస్ నేను కరణ్ షో లో ఉన్నానని చెప్పగా.. దీనికి హాయ్ కృతి అంటూ ప్రభాస్ నవ్వుతూ మాట్లాడినట్లు అనిపించింది.

ఇక ఈ క్రమంలో వెంటనే కరణ్ జోహార్ వచ్చి.. హాయ్ ప్రభాస్ నేను కరణ్ జోహార్ అంటూ.. హే కరణ్ ఇట్స్ మీ.. అని చెప్పు అంటాడు. ఇక ప్రభాస్ కూడా హే కరణ్ ఇట్స్ మీ అని అంటాడు. దీంతో కృతికి ప్రభాస్ వల్ల ఆ షో లో రెండు పాయింట్లు కలిసి వస్తాయి. ఇక కృతిసనన్ నేను నీతో తర్వాత మాట్లాడుతాను ప్రభాస్ అని.. కాల్ కట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్లో తెగ వైరల్ గా మారింది. ఇక మీరు కూడా ఆ వీడియో వైపు ఓ లుక్కెయండి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -