Kodali Nani-Vallabhaneni Vamsi: కొడాలి నాని, వల్లభనేని వంశీ అందుకే సైలెంట్ అయ్యారా?

Kodali Nani-Vallabhaneni Vamsi: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఇంతకాలం అధికార అహంకారంతో ఉన్న వైసీపీ నాయకులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి విజయం చూసి ఒక్కసారిగా నోట మాట రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి విజయం సాధించడంతో అధికార పార్టీ నాయకులు అడ్రస్ లేకుండా పోతున్నారు.

ఇంతకాలం ప్రతిపక్ష నాయకుల గురించి నోటికి వచ్చిన విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార పార్టీ నాయకులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని, టీడీపీ ధిక్కార స్వరం వల్లభనేని వంశీమోహన్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నోటికి ఎంతొస్తే అంత మాట అనడంలో వీరు ముందుండేవారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లపై వీరు వాడిన భాష అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కూడా వీరిద్దరూ ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారు.

 

ఆ తర్వాత ఏమైందో కానీ.. ఈ ఇద్దరు వైసీపీ ఫైర్ బ్రాండ్లు తమ నోటికి తాళం వేసినట్లుగా కామ్ గా ఉంటున్నట్లు ప్రతిపక్ష నేతలు చర్చించుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకున్నా నోటికి వచ్చినట్లు తిట్టి పోసే వీరు మూడురోజులుగా ఎందుకు మాట్లాడటం లేదన్నది ఏపి రాజకీయాలలో చర్చకు దారి తీశాయి. అయితే వారికి హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలివ్వడం వల్లే సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రతిపక్షాల మీద కొడాలి నాని, వల్లభనేని వంశీ దూకుడును వైసీపీ హైకమాండ్ ప్రోత్సహించింది.

 

ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ని తూలనాడిన వారిని అక్కున చేర్చుకుంది. అయితే సామాన్య జనం, రాజకీయాలతో సంబంధం లేని వారికి మాత్రం అధికార పార్టీ నాయకుల తీరు నచ్చలేదు. అంతే కాకుండా సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా వారు చేసే చర్యల తప్పుపట్టారు. రాజకీయ సిద్ధాంతాలు, వైరం నుంచి వ్యక్తిగతంగా మారడం, అధికార పార్టీ నేతలు వారించకపోగా.. ప్రోద్బలం పెరగడం వంటి కారణాలతో చాలా మంది పార్టీకి దూరమయ్యారు. దీంతో వచ్చే ఎన్నికలలో ప్రజలలో వ్యతిరేకత ఎదురవకుండ ముందు జాగ్రత్తగా హైకామండ్ వీరిని సైలెంట్ చేసినట్టు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -