Dil Raju: దిల్ రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపడం సాధ్యం కాదా?

Dil Raju: బలగం ప్రస్తుతం ఎక్కడ చూసిన వినిపిస్తున్నటువంటి పేర్లలో ఈ సినిమా పేరు ఒకటి.ఒక చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టిస్తూ ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డులను అందుకుంటున్నటువంటి బలగం సినిమా భారీ స్థాయిలో ఆదరణ పొందుతుంది. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పనిచేస్తూ సినిమాలపై ఫ్యాషన్ తో, తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఒక అద్భుతమైన కథగా తయారుచేసి తెరకెక్కించారు డైరెక్టర్ వేణు.

ఇలా ఈ సినిమా మార్చి 30వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.కుటుంబ విలువలను ఎంతో అద్భుతంగా చాటి చెప్పడమే కాకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఎంతో అద్భుతంగా చూపించారు. ఇక ఈ సినిమా ప్రభావం తెలంగాణలోని ప్రతి ఒక్క మారుమూల గ్రామం పై ప్రభావం చూపుతుంది. ఏకంగా ప్రతి ఒక్క గ్రామంలోనూ ఈ సినిమాని ఉచిత ప్రదర్శనలు ఇస్తూ అందరికీ చూపిస్తున్నారు.

 

ఇక ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో తెరకేక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి దిల్ రాజుకు మంచి లాభాలను అందిస్తుంది.ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ కైవసం చేసుకున్నారు. అయితే ఈ సినిమా ఇంకా థియేటర్లోనూ డిజిటల్ మీడియాలోను ప్రసారమవుతూ ఉండగానే ఇలా పల్లెల్లో ఉచిత ప్రదర్శనలు ఇవ్వడంతో తమకు భారీ నష్టం వస్తుంది అంటూ దిల్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

 

ఇలా ఈ సినిమా ఉచిత ప్రదర్శనలను అడ్డుకోవాలని దిల్ రాజు ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాధ్యపడడం లేదని తెలుస్తోంది. ఇలా దిల్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈ సినిమా ఉచిత ప్రదర్శనలను ఆపాలని మరిన్ని ప్రయత్నాలు చేసిన ఈ సినిమా ఉచిత ప్రదర్శనలలో ఆపలేకపోతున్నాను. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 12 వేల షోలకు పైగా ఉచిత ప్రదర్శనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ సినిమా చేసి తెలంగాణ ప్రజలను చూడొద్దు అంటూ చెప్పడం అడ్డుకోవాల్సిన విషయమేనని,తెలంగాణ సినిమా నీ సొత్తు కాదు దిల్ రాజు అంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా విషయంపై కామెంట్లు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -