IPL: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్

IPL: ఐపీఎల్ సీజన్ 2023 ప్రస్తుతం కొనసాగుతోంది. క్రికెట్ అభిమానులను ఐపీఎల్ అలరిస్తోంది. థ్రిల్లింగ్‌గా, అత్యంత ఉత్కంఠకరంగా మ్యాచ్‌లు జరుగుతున్నాయి. లాస్ట్ బాల్‌ వరకు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లు క్రికెట్ ప్రేక్షకులను మంచి వినోదాన్ని అందిస్తోన్నాయి. పోటాపోటీగా మ్యాచ్‌లు జరుగుతుండగా.. క్రికెటర్లు తమ తమ టాలెంట్‌తో ప్రేక్షకులను మైమరిపిస్తున్నారు.

తాజాగా ఐపీఎల్‌కి సంబంధించి బీసీసీఐ కీలక ప్రకటన జారీ చేసింది. ప్లేఆప్స్, ఫైనల్ మ్యాచ్‌లకు షెడ్యూల్ ప్రకటించింది, మ్యాచ్ తేడీలు, వేదికలను ప్రకటించింది. శుక్రవారం ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. చెన్నై, అహ్మదాబాద్ వేదికగా ప్లేఆప్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 23న క్వాలిఫయర్ ఫస్ట్ మ్యాచ్, 25న ఎలిమినేటర్ మ్యాచ్‌లు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతాయని బీసీసీఐ స్పష్టం చేసింది.

 

ఇక మే 26న క్వాలిఫయర్ 2, మే 28న ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా వెల్లడించారు. ప్రస్తుతం లీగ్ స్టేజ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. లీగ్ మ్యాచ్ లు మొత్తం 70 వరకు జరగనున్నాయి. మే 21తో లీగ్ మ్యాచ్ లు ముగుస్తాయి. ఆ తర్వాత ప్లేఆప్స్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్లేఆప్స్ రేసు మ్యాచ్ లో రసవత్తరంగా సాగుతున్నాయి.

 

ఈ సారి ఐపీఎల్‌కు మరో రెండు కొత్త జట్లు చేరాయి. దీంతో అన్ని జట్ల మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. ఏ జట్టు ఐపీఎల్ కప్ సాధిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. గత ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హార్డిక్ పాండ్యా ఆధ్వర్యంలోని గుజరాత్ టైనాన్స్ జట్టు ఐపీఎల టోర్నీ గెలుచుకుంది. ఈ సారి కొత్త జట్లు ఐపీఎల్ కప్ సాధిస్తుందా.. లేదా పాత జట్లు సాధిస్తాయా అనేది హాట్‌టాపిక్‌గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -