Jagan: ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు మరో షాక్ తప్పదా?

Jagan: తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించేవారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టి కొట్టుకుపోయినప్పటికీ ఈయన మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన తరచూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు తన మిత్రుడు కుమారుడు ముఖ్యమంత్రి అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.

అయితే తాజాగా ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. జగన్ సర్కార్ మరొక 100 రోజులలో నామరూపాలు లేకుండా పోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జగన్ సర్కార్ కేసులు, ఆర్థిక, రాజకీయ కారణాలతో చాలా చిక్కుల్లో ఉందని తెలిపారు. ఇలా జగన్ పార్టీ మరొక 100 రోజులలో పడిపోతుందంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ సంచలనగా మారాయి.

 

ఒకవైపు తన మిత్రుడి కుమారుడు ముఖ్యమంత్రి అయినందుకు సంతోషంగా ఉందని చెబుతూనే మరోవైపు పార్టీకి శాపనార్ధాలు పెట్టడం ఈయనకే చెల్లిందని చెప్పాలి.వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది బయటకు వచ్చి జగన్ కి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారంతా కూడా సొంత గూటికి రావాలని ఈ సందర్భంగా చింత పేర్కొన్నారు.

 

కాంగ్రెస్ నేతలందరూ సొంతగూటికి వచ్చి వచ్చే ఎన్నికలలో పార్టీ విజయానికి దోహదపడాలని ఈయన పిలుపునిచ్చారు. అయితే ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో చాలామంది చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ నామరూపాలే లేకుండా పోతే ఈయన వచ్చే ఎన్నికలలో అధికారంలోకి తీసుకురావాలంటూ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -