Pushpa 2: బన్నీ మూవీ సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే?

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పనులు శర వేగంగా జరుగుతున్నాయి.ప్రస్తుతం ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేక సెట్ వేసి ఇక్కడ షూటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా పుష్పరాజ్ అడ్డాలోకి కొమరం భీమ్ ఎంట్రీ ఇచ్చారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా సైతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి.అయితే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ విరామ సమయంలో సరదాగా తారక్ పక్కనే షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2 సినిమా లొకేషన్ లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఇలా ఉన్న ఫలంగా పుష్ప షూటింగ్ లొకేషన్లోకి ఎన్టీఆర్ రావడంతో అభిమానులు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు.అయితే ప్రస్తుతం ఐటి అధికారులు మైత్రి ఆఫీసులపై అలాగే సుకుమార్ ఇంటిపై దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ లొకేషన్ లో ఎవరు లేరు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఈ సినిమాకు మించి సీక్వెల్ చిత్రం ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

ఇకపోతే ఎన్టీఆర్ సైతం RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని గ్లోబల్ స్టార్ ట్యాగ్ తగిలించుకున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడో పూర్తి అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -