lifestyle: అద్దంలో ముఖం చూసుకుంటున్నారా.. ఆ తప్పు చేయొద్దంటూ?

lifestyle: సాధారణంగా మనం నిద్ర లేవగానే మనకు ఇష్టమైన దేవుడి ఫోటో చూడటం లేదా మన అరచేతులను చూసుకోవడం, లేదంటే మనకు నచ్చిన మన కుటుంబ సభ్యుల మొహాలను చూడడం వంటివి చేస్తుంటారు. మరికొందరు దేవుడి ఉంగరాలను లాకెట్ లని కూడా కళ్ళు తెరువ గానే చూస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారికి నచ్చిన వారి ఫోటోలను చూస్తూ ఉంటారు. ఇకపోతే మరికొందరు ఇతరుల ఫోటోలు మొహాలను కాకుండా మొహాన్ని చూసుకోవడానికి ఇష్టపడుతుంటారు.

ఈ క్రమంలోనే ఉదయం నిద్ర లేచి సరాసరి అద్దం వద్దకు వెళ్లి వారి మొహాన్ని చూసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇలా ఉదయం నిద్ర లేవగానే అద్దంలో మీ మొహాన్ని మీరు చూసుకోవడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేవగానే అద్దం వద్దకు వెళ్లి తల దువ్వుకోవడం పరమ దరిద్రం అని, ఇలా చేయటం వల్ల దరిద్ర దేవత మన చుట్టూ తాండవిస్తుందని శాస్త్రం చెబుతోంది.

 

ఇకపోతే చాలామంది బ్రష్ చేయకుండా కాఫీలు కూడా తాగుతుంటారు. ఇలా బ్రష్ చేయకుండా కాఫీ తాగే వారికి భవిష్యత్తులో కనీసం ఆహారం కూడా దొరకదట. అంతేకాకుండా తీవ్రమైన అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు.ఇక చాలామంది బ్రష్ చేసేటప్పుడు అటు ఇటు తిరుగుతూ బ్రష్ చేస్తుంటారు కానీ ఇలా చేయడం మంచి పద్ధతి కాదు.

 

మరికొందరు ఉదయం బ్రష్ చేసే సమయంలో విటమిన్ డి కోసం బయట ఎండలో నిలబడి సూర్యుడి వైపు తిరిగి బ్రష్ చేస్తూ ఉముస్తుంటారు. ఇలా చేయడం వల్ల సూర్యదేవుడి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది తద్వారా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మనం బ్రష్ చేసేటప్పుడు ఎవరికి కనిపించకుండా బ్రష్ చేయడం ఎంతో మంచిది. ఇలా ఉదయం లేవగానే ఈ పనులను చేయకపోవడం వల్ల అంతా మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -