KCR: ఏపీ ప్రజలు కేసీఆర్ ను క్షమించడం సాధ్యమవుతుందా?

KCR: తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మంచి ప్లాన్ ని రచించినట్టు తెలుస్తోంది. విశాఖపట్నంలో లక్ష మంది జనంతో భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను తన వైపుకు తిప్పుకోవాలని కేసీఆర్ పెద్ద ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ విశాఖ ని ఎంచుకోవడానికి గల కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే కేసీఆర్ పూర్వీకుల నేటివ్ ప్లేస్ విశాఖ కావడంతో కేసీఆర్ సాగర తీరం నుంచి ఏపీలో బి ఆర్ ఎస్ కి శంకరరావు ఊదాలను గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గులాబి బాస్ ఉత్తరాంధ్రా మీదుగా ఉభయ గోదావరి జిల్లాలు అలా కోస్తా రాయలసీమ అన్నది తన పొలిటికల్ రూట్ మ్యాప్ గా రెడీ చేసి పెట్టుకున్నారని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఏపీలో మొత్తం 175 ఎమ్మెల్యే పాతిక ఎంపీ సీట్లకు పోటీ చేయాలని బీఆర్ఎస్ డెసిషన్ తీసుకుందని ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ తెలిపారు. అన్ని సీట్లకు పోటీ చేయడమే కాకుండా ఏపీలో ఆశాజనకమైన ఫలితాలను సాధిస్తామని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కీలక విభాగానికి బిడ్ వేయకపోవడం టెక్నికల్ మ్యాటర్ తోనే కుదరలేదని ఆయన వివరణ ఇచ్చారు.

 

అంతే తప్ప స్టీల్ ప్లాంట్ విషయంలో తమ చిత్తశుద్ధిని ఎవరూ తప్పుపట్టలేరని సమర్ధించుకున్నారు. ఏపీ రాజకీయాలో బీఆర్ఎస్ వాటా ఉందని, కేసీఆర్ ఏపీ ప్రజల కోసం పోరాడతారని ఆయన అంటున్నారు. మరి కెసిఆర్ ప్లాన్ సక్సెస్ అవుతుందా.. ఏపీ ప్రజలు కేసీఆర్ తప్పులు క్షమిస్తారా అన్నది లేదా తెలియాలి అంటే వీధి చూడాల్సిందే మరి. మొత్తానికి మాత్రం ఏపీ ప్రజల విషయంలో కెసిఆర్ పెద్ద ప్లాన్ ని రచించినట్లు తెలుస్తోంది. మరి విశాఖలో జరగనున్న ఆ భారీ బహిరంగ సభలో ఏం జరుగుతుందో ఎలాంటి పరిణామాలు జరగుతాయి అన్నది చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -