Narendra Modi: మోదీ దగ్గరకు వెళుతున్నారా.. మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే!

Narendra Modi: రాష్ట్ర రాజకీయాలలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణది విలక్షణ శైలిఅని చెప్పాలి ఈయన ఏ పార్టీతో పొత్తు లేకపోవడం వల్ల ఈయన రాష్ట్రంలోనే అన్ని రాజకీయ పార్టీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తలు నిలుస్తుంటారు. తాజాగా బీజేపీ ప్రభుత్వం పై నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎవరైనా శత్రువు ఉన్నారు అంటే అది కేవలం మోడీ మాత్రమేనని తెలిపారు.

ఇప్పటివరకు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ నిధులు మంజూరు చేయలేదు.ఇక పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు ఇవ్వకుండా ఆ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా ఉండడానికి అడ్డుపడుతుంది. ఇక ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇలా మోడీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద శత్రువు అంటూ నారాయణ పేర్కొన్నారు. ఇలాంటి శత్రువుతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తుకు సిద్ధమవుతుందని ఈయన తెలిపారు.

 

మోడీతో పొత్తుకు వెళితే వారు నాశనమైనట్టేనని నారాయణ వెల్లడించారు మోడీ వెలుగుతున్నటువంటి దీపం వంటి వారు దీపం ముద్దుగా ఉందని ముద్దు పెట్టుకోవడానికి వెళ్తే మూతి కాలుతుందని,ఆయనతో ఎవరు పొత్తు పెట్టుకుని రాజకీయాలు చేసేకి ప్రయత్నాలు చేసిన రాజకీయ నాశనం తప్పదని నారాయణ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కూడా బిజెపితో పొత్తుకు సిద్ధమవుతున్నాయి.

 

ఇక మోడీ ఆలోచన ధోరణి చంద్రబాబు నాయుడుకు తెలియంది కాదు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో ఆదరణ సంపాదించుకున్న వైఎస్ఆర్సిపి పార్టీని గద్దె దించాలి అంటే తప్పనిసరి పరిస్థితులలో అది దీపమని తెలిసిన ముద్దు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.ఇక పవన్ కళ్యాణ్ ఒకవైపు టిడిపితోనూ మరొకవైపు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు కానీ బిజెపి మాత్రం తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -