Kajal Aggarwal: కాజల్ ఆ హీరో మాయలో పడిందా.. ఏం జరిగిందంటే?

Kajal Aggarwal: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది. ఇది ఇలా ఉంటే
కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ దంపతులకు ఒక బాబు కూడా జన్మించాడు. మొన్నటి వరకు తన బాబు బాధ్యతలను చూసుకుంటూ సంతోషంగా గడిపిన కాజల్ అగర్వాల్ ఇటీవలే సినిమా లలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే..
ఆర్య 2 సినిమాలో మొదటిసారి అల్లు అర్జున్ కాజల్ జత కట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో కెమిస్ట్రీకి జనాలు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఎవడు సినిమాలో చిన్న గెస్ట్ పాత్రలో కనిపించారు. అప్పుడు కూడా వీళ్ళ జంటకి పాజిటివ్ కామెంట్స్ వినిపించాయి.

ఆ తర్వాత బన్నీ, కాజల్ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఈ క్రమంలోని ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అంటూ ఇండస్ట్రీలో వార్తలు అయ్యాయి. సీన్ కట్ చేస్తే కాజల్ ఆ తర్వాత గౌతమ్ కిచ్చులు ను పెళ్లి చేసుకుంది. అయితే ఇది ఒకప్పటి న్యూస్ అయినప్పటికీ ఇదే విషయాన్ని ప్రస్తుతం కావాలనే కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో ట్రెండు చేస్తున్నారు. కాజల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి బాలయ్య బాబు కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -