Lifestyle: హిజ్రాల నుంచి ఈ వస్తువు తీసుకుంటున్నారా.. మీ కెరీర్ కు ఢోకా లేనట్టే!

Lifestyle: సమాజంలో ఒకప్పుడు హిజ్రాలు అనగానే తీవ్రమైన వివక్ష ఉండేది. కానీ రాను రాను వాళ్ల గురించి తెలుసుకొని వారి గురించి అవగాహన పెరగడంతో వారిని కూడా ఆదరిస్తున్నారు. అంతేకాకుండా హిజ్రాలలో చాలామంది గొప్ప గొప్ప స్థాయిలలో కూడా ఉన్నారు. అయితే సాధారణ మనుషుల జీవితాలకు హిజ్రాల జీవితాలకు చాలా తేడా ఉంటుందని చెప్పవచ్చు. అయితే హిజ్రాల కోసం కూడా ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తోంది. చాలా తక్కువ ప్రదేశాల్లో మాత్రమే హిజ్రాలు అందరితో కలిసి నివసిస్తూ ఉంటారు. చాలా వరకు వీరు నివసించే ప్రదేశాలు కూడా వేరుగా ఉంటాయి. హిజ్రాలలో కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో, రాజకీయాల్లో కూడా ప్రవేశించారు.

హిజ్రాలు దైవంతో సమానమని అంటారు. వారితో ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని అంటూ అంటారు. రామయణంలో హిజ్రాల గురించి ప్రత్యేకంగా కథనం కూడా ఉంది. రాముడు వనవాసానికి వెళ్లేటప్పుడు గ్రామంలోని ప్రజలు వెంట వస్తారు. కొంత దూరం వెళ్లాక ఆడ, మగవాళ్లు ఇంటికి వెళ్లండి అని రాముడు ఆదేశిస్తాడు. అయితే రాముడు వనవాసం నుంచి తిరిగి వచ్చేటప్పుడు హిజ్రాలు అక్కడే ఉంటారట. మీరు ఇక్కడే ఉన్నారేంటి? అని అడగగా మమ్మల్ని వెళ్లమనలేదుగా అని అంటారట. అలా రాముడు వనవాసం నుంచి తిరిగి రాగానే మొదటగా చూసింది హిజ్రాలే కనుక వారు దైవాంశభూతులు అని అంటారు.

 

చాలా వరకు చాలామంది హిజ్రాలు ఇప్పటికీ సమాజానికి దూరంగానే బతుకుతున్నారు. వారి జీవన శైలి సాధారణ ప్రజలకంటే భిన్నంగా ఉంటుంది. వారిలో ఎవరైనా చనిపోతే అర్ధరాత్రి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేస్తారు. ఈ సమయంలో ఎవరైనా చూస్తే వారికి చాలా మంచి జరుగుతుందట. ఇక కొందరు తాము జీవితంలో బాగుండాలని వారిని ప్రత్యేకంగా పిలిపించి ఆశీర్వాదం తీసుకుంటారు. అంతేకాకుండా హిజ్రాలకు మంగళవారం 11 లేదా 21 రూపాయలు దానం ఇవ్వాలట. ఆ సమయంలో వారితో నేను మళ్లీ రేపు వస్తాను అందులో ఏదో ఒక నాణెం ఇవ్వాలని అడగాలట అలా తెల్లారి వెళ్లి వారి వద్ద నుంచి డబ్బు తీసుకొని ఇంట్లో తీసుకొచ్చి దానిని ఎర్రబట్టలో కట్టి పూజచేయాలట. అలా చేస్తే మీకు సిరిసంపదలు వద్దన్నా వస్తాయట. చాలామంది ఈ విషయాన్ని బాగా విశ్వసిస్తారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -