Anantapur: వద్దంటున్నా వినకుండా వివాహేతతో ఎఫైర్.. చివరికి?

Anantapur: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పులు రావడం లేదు. అంతేకాకుండా ఈ వివాహేతర సంబంధాల కోసం ఒకరినొకరు చంపుకోవడం వరకు వెళ్తున్నారు. మహిళలు పరాయి పురుషులతో వివాహేతర సంబంధం కోసం అడ్డు వస్తున్నారని భర్తలను చంపడానికి వెనకాడడం లేదు. పురుషులు కూడా పరాయి స్త్రీల కోసం తాళి కట్టిన భార్యను కూడా చంపేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా వివాహేతర సంబంధానికి మరొక ప్రాణం బలి అయింది.

అసలేం జరిగిందంటే… ఈ ఘటన అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన కుత్తీస్ అలియాస్ ఫృథ్వీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తున్నాడు. అదే పట్టణానికి చెందిన ఒక వివాహితతో కుత్తీస్‌కు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఆమెతో చనువుగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను, ఫోన్ మెసేజ్‌లను చూపించి వివాహిత వేధిస్తోందని అతడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ వివాహిత కుత్తీస్ తనను ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఒకరి మీద ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

 

ఆ వివాహిత వారం రోజుల క్రితం స్పందనలో కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరినీ పిలిచి విచారణ జరిపారు. తిరిగి శనివారం తదుపరి విచారణకు రమ్మన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా వివాహిత కుత్తీస్‌ని రాత్రి తన ఇంటికి రమ్మని వేరే వ్యక్తితో కబురు పంపింది. కుత్తీస్ భార్య లలిత ఆమె దగ్గరకు వెళ్లవద్దని చెప్పింది. పెళ్లికి వెళ్లి వచ్చిన తర్వాత విచారణకు వెళ్దామని చెప్పింది. అయినా కూడా అతను వినిపించుకోకుండా వెళ్తాను అని మొండిపట్టు పట్టాడు. దాంతో లలిత చేసేదేమీ లేక పెళ్ళికి బయలుదేరింది. అయితే, లలిత మార్గం మధ్యలో ఉండగానే ఆమె భర్త ఉరేసుకుని చనిపోయాడని వార్త తెలిసింది. దీంతో ఆమె హుటాహుటిన ఇంటికి వచ్చింది. భర్త శవాన్ని చూసి విలవిల్లాడిపోయింది. తన భర్త ఆత్మహత్యకు కారణం వివాహిత వేధింపులే అని పోలీసులకు చెప్పింది. పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని నిరసన తెలిపింది. ఆమెకు మద్దతుగా కుత్తీస్ స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడినుంచి పంపేశారు. వివాహితపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -