Anchor Suma: అమ్మపై సుమ చూపిన ప్రేమకు నెటిజన్లు కచ్చితంగా ఫిదా కావాల్సిందే!

Anchor Suma: బుల్లితెర లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తూ తన మాటలతో అందరిని మాయ చేసి అభిమానులుగా మార్చుకుంది. ఇప్పటికీ ఇండస్ట్రీలో సుమని దాటి ఏ యాంకర్ ముందుకు వెళ్లలేకపోతోంది. ఒకవైపు టీవీ షో లో యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ల తో పాటు ఇంటర్వ్యూలలో కూడా సందడి చేస్తోంది.

అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా సుమ తన హవా కొనసాగిస్తోంది. సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సుమ ఎప్పటికప్పుడు షాపింగ్, కుకింగ్, హోమ్ టూర్స్, షూటింగ్స్ ఇలా అన్ని విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వెబ్సైట్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

 

ఇంస్టాగ్రామ్ లో సుమ షేర్ చేసే ఫన్నీ రీల్స్ నేటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి బుల్లితెర మీద మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా సుమా నంబర్ వన్ గా కొనసాగుతుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా తాజాగా సుమ యూట్యూబ్ ద్వారా ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సుమ తన తల్లి కోసం బంగారం కొనుగోలు చేసింది. మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లికి బంగారం కానుకగా ఇవ్వాలని అనుకున్న సుమ హైదరాబాదులోని సీఎంఆర్ జ్యువెలరీ షోరూం కి వెళ్లి షాపింగ్ చేసింది.

 

అక్కడ వివిధ రకాల నగలను చూస్తూ ప్రేక్షకులకు కూడా చూపించింది. ఆ తర్వాత తాను చూసిన వాటిలో ఒక సింపుల్ జువెలరీని తన తల్లి కోసం తీసుకున్నట్లు తెలిపింది. మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లికి ఇచ్చే బహుమతి చిన్నదైనా కూడా బోలెడంత ప్రేమను ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -