CM KCR: సీఎం కేసీఆర్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఇదే.. అసలేం జరిగిందంటే?

CM KCR: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు కావడంతో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. 21 రోజులపాటు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించడానికి కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది. దశాబ్ద ఉత్సవాల కారణంగా రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ శుభవార్తను తెలియజేశారు.

రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో భాగంగా రాష్ట్రంలోని బిసి కుల వృత్తుల వారికి లక్ష రూపాయలు చొప్పున సహాయం అందజేయాలంటూ కేసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రజక, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన, కుమ్మరి, మేదరి తదితర వృత్తుల వారికి లక్ష రూపాయలు చొప్పున ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.

 

ఇలా బీసీ కుల వృత్తుల వారికి ఇచ్చే ఈ లక్ష రూపాయలు సాయంగా ప్రకటించే సొమ్మును సాయంగా ఇవ్వాళ లేకపోతే సబ్సిడీ రూపంలో అందజేయాల అన్న విషయాలపై గంగుల అధ్యక్షున మంత్రిమండలి ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంత్రి మండలి ఉప సంఘంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి ఇందులో సభ్యులుగా ఉన్నారు. గురువారం నూతన సచివాలయంలో తొలిసారిగా జరిగిన మంత్ర మండలి సమావేశంలో ఈ నిర్ణయాలను తీసుకున్నారు.ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని 21 రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలోను జిల్లాలోను ఎంతో ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -