Weight Loss: వేసవిలో బరువును తగ్గించే కూల్ డ్రింక్స్.. అవేంటంటే?

Weight Loss: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. ఈ కారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్యకు కారణం మనం తీసుకునే ఆహార పదార్థాలు. అయితే అధిక బరువును తగ్గించుకోవడం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బరువు తగ్గకపోగా ఫలితం లేదని బాధపడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం వేసవికాలం కావడంతో బరువు తగ్గాలంటే వేసవిలో కొన్ని రకాల కూల్ డ్రింక్స్ ను తాగడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

మరి బరువు తగ్గించుకోవడం కోసం వేసవిలో ఎటువంటి డ్రింక్స్ తాగాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా శరీర బరువు పెరగడానికి ప్రధాన కారణాలు గంటల తరబడి ఒకే చోట కూర్చొవడమే అంటున్నారు నిపుణులు. అధికబరువు సమస్య వల్ల సంతానోత్పత్తి, గుండె, ఆస్టియో ఆర్థరైటిస్, టైప్ 2 మధుమేహం వంటి సమస్యలు రావచ్చు. అధిక బరువు ఉన్న పురుషుల్లో కొలొరెక్టల్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మజ్జిగ, నిమ్మకాయ నీటిని తాగాల్సి ఉంటుంది. మజ్జిగతో శరీర బరువును తగ్గించుకోవచ్చు. మజ్జిగ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడానికి, బరువు నియంత్రించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది.

 

వేసవిలో పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి మజ్జిగ దివ్యౌ ఔషధంలా పని చేస్తుంది. ఎందుకంటే మజ్జిగలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ మజ్జిగ తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. అలాగే తులసి గింజలను నీళ్లతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోనాలు కలుగుతాయి. దీంతో పాటు సులభంగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. తులసి గింజల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని నీటిలో కలిపి తీసుకుంటే సులభంగా పొట్ట సమస్యలు కూడా దూరం అవుతాయి. అంతే కాకుండా సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయ కలిపి గోరువెచ్చని నీరు.. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు. ఇలా ఒక నెల పాటు తాగడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -