YS Sharmila: ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడానికి షర్మిల సిద్ధమైందా?

YS Sharmila: వైఎస్ షర్మిల తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయురాలిగా తెలంగాణలో వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే లక్ష్యంతో సొంత పార్టీని పెట్టుకొని పోరాడుతున్న షర్మిల సరియైన దారిలోనే సాగుతున్నారా అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది.

వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు షర్మిల కొన్నేళ్లుగా తెలంగాణలో రాజకీయ భవితవ్యాన్ని వెతుక్కుంటున్నారు. అయితే తెలంగాణలో పని అవ్వదని షర్మిల కు అర్థమైందో ఏమో తెలియదు కానీ కాంగ్రెస్ కి మెల్లగా షర్మిల దగ్గరవుతున్నట్లు సమాచారం. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా వైయస్ షర్మిల గురించి ఆమె పార్టీ గురించి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పక్కాగా సమాచారం ఇస్తుంటారు.

 

షర్మిల టీం స్వయంగా రాధాకృష్ణతో చెప్పి రాయించుకుంటుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. షర్మిల కి తెలంగాణలో నెట్టుకు రావడం కష్టమని అర్థమైందేమో అందుకే ఏపీకి తిరిగి వెళ్తే కాంగ్రెస్ లో చేరితే జగన్ వెంట వెళ్లిపోయిన కాంగ్రెస్ నాయకులు శ్రేణులు వెనక్కి తిరిగి వస్తాయని షర్మిల ఆశాభావం.

 

ఇదే జరిగితే ఆస్తులు పంచి ఇవ్వకుండా తన కంపెనీలో ఇతరులు ఎవరూ పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకుంటున్న జగన్ కి తన సత్తా ఏంటో చూపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది షర్మిల. షర్మిలను కాంగ్రెస్ కి దగ్గర చేయటానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యత తీసుకున్నట్లు రాధాకృష్ణ చెప్పుకొచ్చారు.నెల రోజుల క్రితం ప్రియాంక గాంధీ, షర్మిల ఇద్దరు ఫోన్లో చర్చలు జరిపినట్లు పక్కా సమాచారం.

 

తెలంగాణలో కలిసి పని చేద్దామని.. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏపీలో చురుగ్గా తమ కార్యకలాపాలు కొనసాగించాలని షర్మిలని కాంగ్రెస్ పార్టీ కోరినట్లు సమాచారం. అందుకు షర్మిల అంగీకరించినట్లుగా రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. ఇక ఈ పని ముందే చేసి ఉంటే బాగుండేది అని తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిల తప్పు చేశారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -