Natti Kumar: వైరల్ అవుతున్న నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు!

Natti Kumar: సినిమాల విషయంలో ఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే. కొత్త సినిమా థియేటర్లో విడుదలైన రోజు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రేక్షకులు కూడా ఇంట్లో కూర్చొని ఆ సినిమాని చూసే అవకాశాన్ని కల్పించారు. అయితే సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరైనది కాదంటూ సినీ సెలబ్రిటీల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే నిర్మాత నట్టి కుమార్ ఈ విషయం గురించి మీడియా సమావేశంలో మాట్లాడారు.

నిర్మాత, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి నట్టి కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేనివిధంగా థియేటర్లో సినిమా విడుదలైన రోజే ఏపీ ఫైబర్ ద్వారా ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని సినిమా చూసే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తుంది అయితే ఒక నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా తాను ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు.

 

తెలుగు సినీ పరిశ్రమను, అలాగే నిర్మాతల మండలిని, ఫిలిం ఛాంబర్‌ను సంప్రదించకుండా, జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని ఈయన ప్రశ్నించారు. గతంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అయితే అది సక్సెస్ కాలేదని ఈయన తెలియచేశారు. ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను సర్వనాశనం చేస్తుందని తెలిపారు.

 

ఇక ఒక సినిమాని నిర్మించిన నిర్మాత ఆ సినిమాని ఇవ్వను అంటే ప్రభుత్వం ఎలా ప్రసారం చేస్తుందని ఈయన ప్రశ్నించారు. ఏపీ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి సినిమా ఇండస్ట్రీకి చెందినవారు అయినప్పటికీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారితో మీటింగ్ ఏర్పాటు చేయకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు అంటూ ఈయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -