Chiranjeevi: చిరంజీవి సినిమా అంటే తారక్ కు అంత ఇష్టమా.. అంతలా నచ్చేసిందా?

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో హీరోలు అందరూ ఒకటే. ఒక నటించిన సినిమాని మరొక హీరో చూడడం అన్నది కూడా సర్వసాధారణం. కానీ అభిమానులు మాత్రం మా హీరో గొప్ప మా హీరో గొప్ప అంటూ కొట్టుకు చేస్తుంటారు. అయితే హీరోలు అందరూ ఒకటే అని ఇప్పటికే చాలామంది హీరోలు చెప్పినా కూడా అభిమానులు మాత్రం వారి తీరును మార్చుకోవడం లేదు. అలా హీరోలు వారు నటించిన సినిమాలు మాత్రమే కాకుండా ఇతర హీరోలు నటించిన సినిమాలు ఇష్టపడుతూ ఉంటారు. అలా హీరో జూనియర్ ఎన్టీఆర్ కు చిరంజీవి నటించిన ఒక సినిమా అంటే చాలా ఇష్టం అని ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఒక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

అయితే ఇది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక అందులో తారక్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలో నాకు రుద్రవీణ అంటే చాలా ఇష్టం. 1988లో విడుదలైన ఈ సినిమా తల్లి పేరు మీద నాగబాబు నిర్మాతగా చిరు స్వంత బ్యానర్ మొదలుపెట్టిన కొత్తలో డెబ్యూ ప్రొడక్షన్ ఇది. కులాల అంతరాల గురించి సంగీతానికి ముడిపెడుతూ దర్శకుడు బాలచందర్ రుద్రవీణని ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. యముడికి మొగుడు లాంటి కమర్షియల్ మసాలాలతో మాస్ ని ఊపేస్తున్న టైంలో చిరు చేసిన సినిమా కావడంతో రుద్రవీణ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.

 

కానీ మెగాస్టార్ లోని బెస్ట్ యాక్టర్ బయటికి వచ్చింది మాత్రం ఈ సినిమాలోనే అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని తారక్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -