KCR: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. ఏం చెప్పారంటే?

KCR: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్తను చెప్పారు. ఆ వర్గానికి చెందిన ఒక్కొక్కరి ఖాతాలో ఈయన లక్ష రూపాయలు జమ చేయబోతున్నారని తెలియడంతో తెలంగాణ ప్రజల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. తెలంగాణలోని బిసి కులవృత్తులు, చేతి వృత్తిదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఈ పథకానికి అర్హత పొందిన వారందరూ కూడా https://tsobmmsbc.cgg.gov.in/applicationFormforBC.action ఈ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఫోటో, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఈనెల తొమ్మిదవ తేదీ ప్రారంభించబోతున్నట్లు మంత్రి తెలియజేశారు.

 

మంచిర్యాల జిల్లాలో ఈ నెల 9వ తేదీ లక్ష రూపాయలు ఆర్థిక సాయం పంపిణీ ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది.కులవృత్తులు చేతివృత్తుల వారు వారి పనిముట్లను ఇతర సామాగ్రిని కొనుగోలు చేయడానికి సీఎం కేసీఆర్ ఆసరాగా ఈ లక్ష రూపాయలను నేరుగా వారి ఖాతాలో జమ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విధంగా కేసీఆర్ ఆర్థిక సహాయం అందించడంతో సదురు సామాజిక వర్గానికి చెందిన వారందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -