CM KCR: అరకొర నిధులతో కడుపెట్లా నింపేది.. సీఎం కేసీఆర్ ఆలోచిస్తారా?

CM KCR: తెలంగాణ సర్కార్రాష్ట్ర దశాబ్ద వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోని తెలంగాణలోని ప్రతి ఒక్క గ్రామంలో కూడా చెరువు పండగ చేయాలి అంటూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రతి గ్రామంలో చెరువు పండుగ చేయడం కోసం గ్రామానికి 25000 నిధులు మంజూరు చేశారు.ఇలా ఈ డబ్బులతో గ్రామస్తులందరికీ చికెన్ తో పాటు మరొక వెజిటేరియన్ కర్రీ వైట్ రైస్ పాపడ్ వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

అలాగే చెరువు కట్టపై పెద్ద ఎత్తున రంగువలు వేసి మామిడి తోరణాలు కట్టి ప్రత్యేక పూజలు చేయాలని, చెరువు దగ్గర గజ ఈతగాలను సిద్ధంగా పెట్టాలని తెలిపారు .డప్పు వాయిద్యాలు నడుమ ఈ చెరువు పండుగను నిర్వహించాలని తెలిపారు. అంతేకాకుండా చెరువు వద్దకు వెళ్లడం కోసం మార్గమంతా లైట్లు వేసి డెకరేషన్ చేయాలని అలాగే ఆ ప్రదేశం అంతా చదును చేయడం కోసం వంట సామాగ్రిని తీసుకురావడం కోసం కూడా ఇదే డబ్బులను ఉపయోగించాలని తెలిపారు.

 

ఈ విధంగా గ్రామం మొత్తానికి నాన్ వెజ్ పెట్టాలి అంటూ 25 వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడంతో గ్రామ సర్పంచులు ఒక్కసారిగా భయపడుతున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున అప్పులు చేశామని ఇప్పుడు 25 వేలుతో గ్రామస్తులందరికీ నాన్ వెజ్ ఎలా పెట్టగలం ఇది ఎలా సాధ్యమవుతుంది అంటూ సర్పంచులు తలలు పట్టుకున్నట్లు తెలుస్తోంది.

 

చిన్న పెద్ద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్క గ్రామానికి 25000 మంజూరు చేయడం పట్ల సర్పంచులు కొంత పాటి అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామాలకి 25000 ఏమాత్రం సరిపోవు అలాంటిది నాలుగు ఐదు వేల మంది జనాభా ఉన్నటువంటి గ్రామాలకు 25 వేలుతో ఎలా భోజనం పెట్టాలి అంటూ తలలు పట్టుకున్నారు. ఇక గ్రామస్తులకు కడుపునిండా భోజనం పెట్టకపోతే తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -