Bhola Shankar: భోళా శంకర్ టీజర్ పై నెగిటివిటీ.. ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా టీజర్ విడుదల అయింది. తమిళ్ మూవీ వేదాళం కు రీమేక్ గా బోళాశంకర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం శంకర నిర్మిస్తున్నారు.

సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ చిత్రం టీజర్ ను చూసిన ప్రేక్షకులే కాదు మెగా అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా చిరంజీవికి మరో ఆచార్య అవుతుందేమో అని భయపడుతున్నారు. ఎందుకంటే అసలే ఈ కథ అనువాదం అని అందరికీ తెలిసిందే పైగా అందరికీ తెలిసిన రొటీన్ కదే.

పోనీ చిరంజీవి కోసమైనా చూద్దాం కదా అని ఆశపడుతున్న అభిమానులకి ఫ్లాప్ చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్టర్ కావడం మింగుడు పడటం లేదు. కరోనా సమయంలో చిరంజీవి చేసిన సేవ కార్యక్రమాలని దగ్గరుండి చూసుకున్నాడంట మహర్ రమేష్. అందుకోసం ఆయనకి ఫేవర్ గా ఏమైనా చేయాలని ఉద్దేశంతో చిరంజీవి ఈ సినిమాని మెహర్ రమేష్ చేతిలో పెట్టారంట..

అయితే టీజర్ గురించి సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్ ని చూసి మెగా అభిమానులు కూడా ఈ సినిమా మీద ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తుంది. సినిమా మొత్తం ట్రోలింగ్ మెటీరియల్ గా కనిపిస్తుంది అంటూ మెగా అభిమానులు తెగ బాధ పడిపోతున్నారు. టీజర్ ఇలా ఉందంటే ఇంకా ట్రైలర్ ఎలా ఉంటుందో అంటూ తెగ చర్చించుకుంటున్నారు.

 

చిరంజీవికి తెలంగాణ యాస కుదరకపోవడం వల్ల ఆయన డైలాగ్ డెలివరీ కూడా తేడా కొట్టినట్లు టీజర్ లో కనిపిస్తుంది. ఒరిజినల్ సినిమాలో లేనిది ఈ సినిమా కోసం ఏదైనా ఒక సర్ప్రైజ్ ఉంటేనే సినిమా మీద ఒక అంచనాకు రావచ్చు. లేదంటే కచ్చితంగా చిరంజీవికి మరొక ఆచార్యలాగా చేదు అనుభవం తప్పదు అంటున్నాడు సగటు ప్రేక్షకుడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -