Charan-Upasana: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్న పేర్లు రామ్ చరణ్, ఉపాసన. కూతురు క్లింకార పేరు కూడా సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఇటీవలే రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఇక తాజాగా రామ్ చరణ్, ఉపాసన ల కూతురికి పేరు కూడా పెట్టారు. తాజాగా మెగా ఫ్యామిలీ మెగా ప్రిన్సెస్ కు బారసాల ఫంక్షన్ ను గ్రాండ్ గా జరిపారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే మెగా మనవరాలు బారసాల ఫంక్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి చిరంజీవి కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో గిఫ్ట్ లను రెడీ చేశారట.
అయితే బారసాల ఫంక్షన్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగింది. తాటాకులతో, కొబ్బరి చిప్పలతో ఒరిజినల్ ఫ్లవర్స్ తో చాలా ట్రెడిషనల్ గా డెకరేట్ చేసిన లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.అయితే ఉపాసన,చరణ్ పాప బారసాల ఫంక్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి మెగాస్టార్ చిరంజీవి పట్టుచీర గాజులతో పాటు గోల్డ్ కాయిన్ గిఫ్ట్ చేస్తున్నారట. మెగా మనవరాలు పుట్టిన శుభ సందర్భంగా ఇలా తన మనవరాలు పై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారట. ఏది ఏమైనా సరే మెగా మనవరాలు అందరికన్నా చాలా స్పెషల్ అంటూ మెగాస్టార్ చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇప్పటివరకు తన ఫ్యామిలీలో ఇంత మంది మహాలక్ష్మి లాంటి పిల్లలు పుట్టిన ఏనాడు చిరంజీవి ఇలాంటి పని చేయలేదు.
చరణ్ కూతురికి మాత్రమే చేస్తున్నారంటే ఎంత స్పెషల్ నో అర్థం చేసుకోవచ్చు. అయితే మెగా ఫ్యామిలీ అంత ఖరీదైన బహుమతులు ఇవ్వడంతో నేటిజన్స్ అభిమానులు షాక్ అవుతున్నారు. మెగా ప్రిన్సెస్ నిజంగా చాలా అదృష్టవంతురాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.