Nagarjuna NTR: నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ మధ్య దూరానికి అసలు కారణమిదా?

Nagarjuna NTR: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలందరూ కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అయితే కొన్నిసార్లు కొందరి హీరోల మధ్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలు రావటం వల్ల వారి మధ్య దూరం ఏర్పడుతుంది ఇలా ఎన్టీఆర్ నాగార్జున మధ్య కూడా చిన్న కారణం వల్ల దూరం పెరిగిందని తెలుస్తోంది. మరి ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి ఈ దూరానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

సాధారణంగా కొంతమంది డైరెక్టర్లు సినిమా కథ రాసేటప్పుడు ఈ కథ ఫలానా హీరో కైతే బాగుంటుంది అని ఊహించుకొని కథ రాస్తారు. అదే కథతో ఆ హీరో వద్దకు వెళ్లి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఆ కథ నచ్చకపోవడంతో ఆ సినిమా ఇతర హీరోల చేతికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎంతోమంది హీరోలు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఇలాంటి హిట్ సినిమాలు మిస్ చేసుకున్నటువంటి వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు.

 

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్ నాగార్జున కాంబినేషన్లో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఈ సినిమా ఆగిపోయింది. అయితే ఎన్టీఆర్ బదులు మరో హీరో ఈ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మరి ఎన్టీఆర్ మిస్ చేసుకున్న సినిమా ఏంటి అనే విషయానికి వస్తే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున కోలీవుడ్ హీరో కార్తీ నటించిన ఊపిరి. ఈ సినిమాలో కార్తీ స్థానంలో ఎన్టీఆర్ ను ఊహించుకొని కథ మొత్తం సిద్ధం చేశారట.

 

ఇక ఎన్టీఆర్ కి ఈ కథ చెప్పినప్పుడు ఎన్టీఆర్ ఈ కథను చాలా సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఇలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో తిరిగి కార్తీక్ ఈ సినిమాలో భాగమయ్యారు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాని ఎందుకు వదులుకున్నారనే విషయాన్నికి వస్తే ఈ సినిమాలో ఒకానొక సమయంలో నాగార్జున కాళ్ళను పట్టుకోవాల్సిన సన్నివేశం ఉన్న సంగతి తెలిసిందే అయితే నాగార్జున కాళ్ళను ఎన్టీఆర్ పట్టుకుంటే తన అభిమానులు ఏమాత్రం ఇష్టపడరని ఎన్టీఆర్ ఈ సినిమాకు నో చెప్పారట ఎలా తనతో కలిసి నటించడానికి ఎన్టీఆర్ నో చెప్పడంతో నాగార్జున బాధపడుతూ అప్పటినుంచి ఎన్టీఆర్ కు దూరంగా ఉన్నారని తెలుస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -