Allu Arjun: స్టార్ హీరో అల్లు అర్జున్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా?

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం దేశముదురు. పోకిరి సినిమా తర్వాత ఎన్నో అంచనాల నడుమ పూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ద్వారా నటి హన్సిక తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. బాలనటిక ఎన్నో సినిమాలలో నటించిన ఈమె దేశముదురు సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు.

ఇక ఈ సినిమా ద్వారా తెలుగు తమిళ భాషలలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస అవకాశాలు అందుకున్నటువంటి హన్సిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె దేశముదురు సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమా సమయంలో తన వయసు కేవలం 16 సంవత్సరాల అని అయితే అప్పటికే కొన్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను కానీ ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి కాస్త ఇబ్బంది పడ్డానని తెలిపారు.

 

ఇక అల్లు అర్జున్ తో పాటు సమానంగా డాన్స్ వేయడం కోసం ఎంతో కష్టపడ్డానని తెలిపారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో అల్లు అర్జున్ తనకు అన్నం తినిపించే సన్నివేశం ఉంది నాకైతే చిన్న చిన్న ముద్దలు తినడం అలవాటు కానీ అల్లు అర్జున్ ఒకేసారి పెద్ద ముద్దులు పెట్టడంతో తన వల్ల కాలేదని,చిన్నగా పెట్టమని చెబితే తిట్టి మరి పెద్ద ముద్దలు తినిపించారు అంటూ హన్సిక ఈ సందర్భంగా తెలియజేశారు.

 

ఇక మరొక సన్నివేశంలో తనని హగ్ చేసుకోవలసి ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా నాకు ఆ సన్నివేశం అర్థం కాలేదు. ఇది అయ్యే పనిలా లేదని అల్లు అర్జున్ వచ్చి నా తలపై ఒకటి పీకి మరి నన్ను హగ్ చేసుకున్నాడంటూ కొన్నిఫన్నీ సన్నివేశాల గురించి హన్సిక చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -