Jagan-Pawan: జగన్ పై హద్దులు దాటిన పవన్ విమర్శలు.. ఏం జరిగిందంటే?

Jagan-Pawan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే వాలంటీర్లను టార్గెట్ చేస్తూ ఈయన మాట్లాడటంతో వాలంటీర్లు తీవ్రస్థాయిలో నిరసనలు తెలియజేస్తూ ఆందోళనలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి మాట్లాడటంతో వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులు రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో. దొరికిపోయారు అంటూ ఇదే అదునుగా భావించిన వైసీపీ నేతలు తనపై విమర్శలు చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే కాస్త జగన్ పట్ల హద్దులు మీరి మాట్లాడుతున్నారని తెలుస్తోంది.

 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లి అక్కకి మర్యాద, రక్షణ ఇవ్వలేదు అలాంటిది ఒక పరాయి స్త్రీకి ఎలాంటి గౌరవం ఇస్తారని ఆశించాలి అంటూ ఈయన మాట్లాడారు. ఆయన రాజకీయాలకు ఏమాత్రం సంబంధంలేని నా భార్య గురించి మాట్లాడారు. కానీ నేను ఏ రోజు కూడా జగన్ భార్య భారతి గారి గురించి తప్పుగా మాట్లాడలేదు ఆ విషయం ఆమెనే అడిగి తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డికి సూచనలు చేశారు.

 

భారతి గారిని ఉద్దేశిస్తూ మీ భర్తని మీరు కాస్త అదుపులో పెట్టుకోమని సూచించారు. ఇలా ఎప్పుడైతే జగన్ నా భార్యను అవమానించారో అప్పటినుంచి నేను ఆయనకు మర్యాద ఇవ్వడం లేదని అందుకే తనని ఏక వచనంతో పిలుస్తున్నానని పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శలు కురిపించారు. అయితే కొందరి ఈ వ్యాఖ్యలు చూసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడటం సరికాదని ఈ విషయంలో ఆయన కాస్త హద్దులు మీది ప్రవర్తిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -