Sharmila-Sonia: సోనియా గాంధీని కలిసిన తర్వాత షర్మిల ప్రణాళిక ఇదేనా?

Sharmila-Sonia: వైయస్సార్ కుమార్తె షర్మిల ప్రస్తుతం వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తెలంగాణ రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉన్నటువంటి ఈమె గురించి గత కొంతకాలంగా ఓ వార్త వైరల్ గా మారింది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.ఈ విధంగా ఈమె తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు గురించి చర్యల గురించి ఎలాంటి చర్చలు జరపలేదని సమాచారం.

అయితే తాజాగా షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవబోతున్నారంట కూడా ఒక వార్త వైరల్ గా మారింది. ఈనెల 17, 18 వ తేదీలలో బెంగళూరులో బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సమావేశాలలో దాదాపు24 పార్టీలు పాల్గొనబోతున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా హాజరు కాబోతున్నారు. అదేవిధంగాఈ సమావేశాలలో పాల్గొనబోయే అందరికీ 17వ తేదీ రాత్రి విందు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

 

ఇక ఈ విందు కార్యక్రమానికి వైయస్సార్ టీపి పార్టీ అధ్యక్షురాలు షర్మిలను కూడా ఆహ్వానించబోతున్నారని సమాచారం.అయితే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీని విలీనం చేస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగించి తన అన్నను రాజకీయంగా దెబ్బ కొట్టాలని పథకం వేస్తున్నారు.

 

కానీ షర్మిల మాత్రం తాను తెలంగాణలోనే రాజకీయం చేస్తానని తెలంగాణ రాజకీయాలలో కొనసాగుతానని చెబుతూ వస్తున్నారు అయితే దీనిని రేవంత్ రెడ్డి పూర్తిగా ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఈ నెల జరగబోయే బిజెపి వ్యతిరేక సమావేశాలలో షర్మిల పాల్గొన్న అనంతరం ఈమె కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా లేక తన పార్టీని విలీనం చేస్తారా అన్న విషయం గురించి క్లారిటీ రానుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -