Vasthu: మీ ఇంట్లో ఇవి కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త.. ఏకంగా అంత అరిష్టం జరుగుతుందా?

Vasthu: వాస్తు శాస్త్రాన్ని నమ్మడంతో పాటు వాస్తు ప్రకారంగా నడుచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. వాస్తు విషయాలను తూచా తప్పకుండా పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా మెరుగవుతాయి. చాలా మంది ఈ రోజుల్లో కూడా వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు ప్రకారం పాటిస్తే అనారోగ్య సమస్యలు మొదలు అనేక ఇబ్బందుల్ని తరిమికొట్టవచ్చు. కాగా కొన్ని సూచనల‌ ద్వారా మనం ఇంట్లో వాస్తు దోషం ఉంద‌ని చెప్పవ‌చ్చ‌ని జ్యోతిష్య పండితులు అంటున్నారు.

అయితే ఒకవేళ మీ ఇంట్లో కూడా వాస్తు దోషం ఉందేమో అనే సందేహం మీకు ఉందా? అయితే కచ్చితంగా మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇటువంటి సంకేతాలు వాస్తు దోషం ఉన్న ఇళ్లల్లో కనపడతాయి. మరి సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో కుక్క ఎప్పుడూ ఒకే వైపుకి తిరిగి అరుస్తూ ఉన్నట్లయితే అక్కడ వాస్తు దోషం ఉందని చెప్పవచ్చు. ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు కూడా వస్తున్నట్లయితే కచ్చితంగా వాస్తు దోషం ఉందని చెప్పవచ్చు. ఇంట్లో స్త్రీలు ఇబ్బంది పడుతున్నట్లయితే కూడా ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లు చెప్పవచ్చు.

 

అలాగే ఎప్పుడూ కూడా ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఇంటి యజమాని పేరుని, నక్షత్రాన్ని బట్టి ఇంటిని వాస్తు ప్రకారం కట్టుకోవాలి. ముఖద్వారం ఏ వైపు ఉంటే మంచిది అనేది కూడా మొదట చూసుకోవాలి. ఇలా ముందే అన్నింటినీ తెలుసుకుని ఆ తర్వాత ఇల్లు కట్టుకోవాలి. అంతేకానీ స్థలం ఉంది కదా అని వాస్తు పండితులను సంప్రదించకుండా ఇల్లు కట్టుకుంటే అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -