KCR: కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదా.. ఆ తప్పులే శాపమా?

KCR: జాతీయ రాజకీయాలలో పాపం కేసీఆర్ ని ఎవరు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అందుకు నిదర్శన బెంగళూరులోని ప్రతిపక్షాల సమావేశానికి పాపం కేసిఆర్ కి కనీసం ఆహ్వానం అందలేదు దాంతో జాతీయస్థాయిలో చక్రం తిప్పుదాం అనుకున్న కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ తగిలిందనే చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఢిల్లీలో మంగళవారం సాయంత్రం ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో మీటింగ్ జరగబోతుంది.

దీనికి ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి రావటం కోసం తగిన సలహాలు సూచనలు తీసుకోవడం కోసం సమావేశం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఎన్డీఏని బలోపేతం చేయటంలో భాగంగా భాగస్వామ్య పార్టీలనే కాకుండా కొత్తగా మరొక ఎనిమిది పార్టీలను కూడా బిజెపి సమావేశానికి ఆహ్వానించింది. ఆ సమావేశం 17, 18 తేదీల్లో బెంగళూరులో మొదలైపోయింది అయితే ఇందులో యూపీఏ కూటమితో పాటు ఇతర ప్రతిపక్షాలు అన్నీ కూడా పాల్గొన్నాయి.

 

ఈ సమావేశానికి 24 పార్టీలు పాల్గొన్నాయి. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఎన్డీఏని దెబ్బ కొట్టడానికి అవసరమైన వ్యూహాలని చర్చించడం. అయితే ఈ 24 పార్టీలలోని మన కేసీఆర్ పార్టీ లేకపోవటం విశేషం ఎందుకంటే ఇక్కడ ఎన్ డి ఏ నుంచి గాని యూపీఏ నుంచి గాని కెసిఆర్ కి ఆహ్వానం అందలేదు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని అందరికీ తెలిసిందే అవసరాలకు కొద్ది ఈ పార్టీలను కలుపుకుంటారు.

 

అవసరం లేనప్పుడు కరివేపాకు లాగా తీసి పడేస్తారు. ఆ ఉద్దేశంతోనే యూపీఏ కెసిఆర్ కి ఆహ్వానం పంపుతుందని అందరూ అనుకున్నారు ఎన్డీఏ కి ఎలాగూ కేసీఆర్ అవసరం అక్కర్లేదు అది ముందు నుంచి తెలిసిందే. అయితే ఇప్పుడు యూపీఏ కూడా కెసిఆర్ ని ఆహ్వానించడం లేదంటే కెసిఆర్ ని ఆ రెండు పార్టీలు ఎంతగా విశ్వసించటం లేదు మనందరికీ అర్థమవుతూనే ఉంది. ఇలా అయితే జాతీయ స్థాయిలో కేసీఆర్ చక్రం తిప్పడం కష్టమే మరి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -