Prabhas: వైరల్ అవుతున్న ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు!

Prabhas: ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ప్రాజెక్టు కే. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్, గ్లింప్ వీడియోని విడుదల చేశారు .ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా టైటిల్, గ్లింప్ ను కామిక్ కాన్ ఈవెంట్లోప్రదర్శించడం విశేషం ఇలా ఈ వేదికపై ప్రదర్శించిన మొట్టమొదటి తెలుగు సినిమాగా ప్రాజెక్టుకి రికార్డ్ సృష్టించింది.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొనీ సందడి చేశారు.అయితే ఈ కార్యక్రమానికి వెళ్లేముందు చిత్ర బృందం హాలీవుడ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఇందులో భాగంగా ప్రభాస్ ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఇది ఒక సూపర్ హీరో సినిమా. ఇందులో క్యారెక్టర్ కొంచెం ఫన్ గా కూడా ఉంటుంది. నాగ్ అశ్విన్ నా క్యారెక్టర్ ని డిజైన్ చేసిన తీరు నాకు బాగా నచ్చింది. నాగి కూడా చాలా ఫన్నీగా ఉంటాడు. సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. నేను ఈ సినిమాలో కమెడియన్ ని అని అన్నాడు. ఇలా ప్రభాస్ ఈ సినిమాలో నేనే కమెడియన్ అంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఈ సినిమా గ్లింప్ కనక చూస్తే ఇందులో ప్రభాస్ చాలా సీరియస్ పాత్రలో కనిపించినట్టు ఉంది అలాంటిది ప్రభాస్ మాత్రం తాను ఇందులో కమెడియన్ అంటూ కామెంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇక ప్రభాస్ ఈ వ్యాఖ్యలను సరదాగా అన్నారా లేకపోతే సీరియస్ గానే చెప్పారా అన్న సందిగ్ధంలో అభిమానులు పడ్డారు. అయితే ఈ సినిమాకు అనుకున్న విధంగానే కల్కి అనే టైటిల్ ఖరారు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్ కనక చూస్తే హాలీవుడ్ ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -